Bandi Sanjay: కరీంనగర్‌ గడ్డ.. బీజేపీ అడ్డా

ABN , First Publish Date - 2022-12-15T17:53:54+05:30 IST

కరీంనగర్‌ గడ్డ.. బీజేపీ (BJP) అడ్డా అని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పష్టం చేశారు.

Bandi Sanjay: కరీంనగర్‌ గడ్డ.. బీజేపీ అడ్డా

కరీంనగర్: కరీంనగర్‌ గడ్డ.. బీజేపీ (BJP) అడ్డా అని బీజేపీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) స్పష్టం చేశారు. ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభలో బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్‌ (Karimnagar) గడ్డ గర్జిస్తే కొందరికి వెన్నులో వణుకుపుట్టాలన్నారు. ప్రజలు, ధర్మం కోసమే తమ పోరాటమని తెలిపారు. హిందూధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తామని, అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిస్తామని ప్రకటించారు. కరీంనగర్‌ స్ఫూర్తితో గడీల పాలనపై పోరాడుదామని, తెలంగాణను కాషాయపు జెండాతో పవిత్రం చేస్తామని సంజయ్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ (BRS) పేరుతో తెలంగాణను తీసేశారని విమర్శించారు. సీఎం జగన్‌, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనని, దోచుకో, దాచుకో అనే పాలసీతో పరిపాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇద్దరు సీఎంలు కలిసి సమైక్యాంధ్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ధ్వజమెత్తారు. రైతుబంధు, దళితబంధు ఇవ్వడం లేదన్నారు. ధరణి పోర్టల్‌ పేరుతో భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అంటేనే బందిపోట్ల రాష్ట్ర సమితి అని విమర్శించారు. ప్రధాని మోదీని ఎదుర్కొనే దమ్ములేకే గుంటనక్కలు ఏకమవుతున్నాయని బండి సంజయ్ ఎద్దేవాచేశారు.

Updated Date - 2022-12-15T18:01:07+05:30 IST