Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-12-13T11:59:47+05:30 IST

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

Vemula Prashanth Reddy: బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ ఏర్పాట్లు పూర్తి

న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం (BRS Party Office) ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Telangana Minister Vemula Prashanth Reddy) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సైనికుడిగా తనకు అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానన్నారు. బీఆర్‌ఎస్‌లో తనను ఒక భాగస్వామిగా చేయడం అదృష్టమని అన్నారు. రేపు 12:37 గంటల నుంచి 12:47 మధ్య బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా పార్టీ జెండాను అవిష్కరించనున్నారని తెలిపారు. పార్టీ ప్రారంభోత్సవానికి జేడీఎస్ నేత కుమారస్వామి (JDS Kumara Swamy), అఖిలేష్ యాదవ్ (Akilesh Yadav), తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) హాజరు కానున్నారని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2022-12-13T11:59:48+05:30 IST