Vaishali: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డి అరెస్ట్

ABN , First Publish Date - 2022-12-13T22:00:05+05:30 IST

డాక్టర్ వైశాలి (Vaishali) కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని (Naveen Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు.

Vaishali: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్‌రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: డాక్టర్ వైశాలి (Vaishali) కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని (Naveen Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఆదిభట్ల పోలీసులు (Adibhatla Police) తెలిపారు. గోవా కాండోలిమ్‌ బీచ్‌ దగ్గర నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుంచి 5 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌రెడ్డిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పెళ్లికి ఒప్పుకోలేదని ఈ నెల 9న వైశాలిని కిడ్నాప్ నవీన్‌రెడ్డి చేశాడని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కిడ్నాప్ కేసులో 30 మందికి పైగా అరెస్టయ్యారు.

Updated Date - 2022-12-13T22:00:35+05:30 IST