KomatiReddy: ప్రధాని మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ
ABN , First Publish Date - 2022-12-16T14:03:21+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. మోదీతో దాదాపు 25 నిమిషాల పాటు కోమటిరెడ్డి సమావేశమయ్యారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు (Congress MP Komatireddy Venkata Reddy met Prime Minister Narendra Modi). మోదీతో దాదాపు 25 నిమిషాల పాటు కోమటిరెడ్డి సమావేశమయ్యారు. మూసి ప్రక్షాళన, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల రోడ్ల విస్తరణ అంశాన్ని ప్రధానమంత్రికి వివరించారు. వెంటనే అధికారులకు సూచిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల అంశంపై ప్రధానితో చర్చకు రాలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.