Tarun chugh: తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ రావటం ఖాయం

ABN , First Publish Date - 2022-12-30T12:11:39+05:30 IST

తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ పోరాడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తెలిపారు.

Tarun chugh: తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ రావటం ఖాయం

న్యూఢిల్లీ: తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ పోరాడుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ (BJP Telangana State Affairs Incharge Tarun Chugh) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు దుఃఖంలో ఉన్నారన్నారు. కేసీఆర్ కుటంబ అహంకారం, అవినీతి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ రావటం ఖాయమని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-30T12:11:41+05:30 IST