Pakistan vs England: ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటింగ్ కకావికలం.. టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-11-13T15:36:20+05:30 IST

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ తేలిపోయింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో..

Pakistan vs England: ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటింగ్ కకావికలం.. టార్గెట్ ఎంతంటే..

మెల్‌బోర్న్: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ తేలిపోయింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. కీలక మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు ‘క్యూ’ కట్టారు. షాన్ మసూద్ చేసిన 38 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ అంటే ఏ స్థాయిలో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా సామ్ కర్రాన్ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్, పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కూడా 32 పరుగులకే అడిల్ రషీద్ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. దీంతో.. పాకిస్థాన్ జట్టు 45 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. మహ్మద్ హారిస్ 8 పరుగులు, ఇఫ్తికర్ అహ్మద్ అయితే డకౌట్‌గా వెనుదిరిగి పాక్ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు.

షాన్ మసూద్ ఒక్కడే 28 బంతుల్లో 38 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. షాదాబ్ ఖాన్ 20 పరుగులు, మహ్మద్ నవాజ్ 5, మహ్మద్ వసీమ్ జూనియర్ 4 పరుగులకే చేతులెత్తేశారు. ఇలా.. పాకిస్థాన్ ఓపెనర్ల నుంచి మిడిలార్డర్ వరకూ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కకావికలమైంది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. టీమిండియా 169 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తేనే ఒక్క వికెట్ కోల్పోకుండా టార్గెట్‌ను రీచ్ అయిన ఇంగ్లండ్ జట్టుకు 138 పరుగుల టార్గెట్ పెద్ద లెక్కేం కాదనే వాదన వినిపిస్తోంది. అయితే.. పాక్‌ బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయలేమని.. పాక్‌కు బౌలింగే బలం అని పాక్ అభిమానులు గుర్తుచేస్తున్నారు.

Updated Date - 2022-11-13T15:36:48+05:30 IST