-
-
Home » Prathyekam » This is what the prisoner finally said after showing the Prison food to the judge kjr spl-MRGS-Prathyekam
-
ఓ కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తికి కోర్టులోనే ఊహించని అనుభవం.. బ్యాగులోంచి ఆ ఖైదీ చపాతీలు తీసి..
ABN , First Publish Date - 2022-07-20T22:05:37+05:30 IST
అతనో ఖైదీ.. హత్యాయత్నం కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే కేసు విచారణ సమయంలో న్యాయమూర్తికి ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. కేసు గురించి విచారణ చేస్తుండగా...

అతనో ఖైదీ.. హత్యాయత్నం కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే కేసు విచారణ సమయంలో న్యాయమూర్తికి ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. కేసు గురించి విచారణ చేస్తుండగా.. దీంతో సంబంధం లేకుండా ఓ ఖైదీ బ్యాగులోంచి చపాతీలు బయటకు తీశాడు. ఈ అనూహ్య ఘటనతో న్యాయమూర్తితో పాటూ అక్కడున్న అధికారులంతా అవాక్కయ్యారు. చివరకు అతడు చెప్పింది విని.. న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. అసలు ఏం జరిగిందంటే..
బీహార్(Bihar) రాష్ట్రం బెగుసరాయ్ జిల్లా కోర్టు(Court)లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చందన్‌కుమార్ యాదవ్ అనే వ్యక్తి హత్యాయత్నం కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలావుండగా, మంగళవారం న్యాయమూర్తి(Judge) సతీష్ ఝా కేసుల విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చందన్‌కుమార్ యాదవ్ కేసు విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఖైదీ.. ఒక్కసారిగా బ్యాగులోంచి కవరు తీసి, న్యాయమూర్తి టేబుల్‌పై పెట్టాడు. దీంతో ఏం జరుగుతుందో అక్కడున్న అధికారులకు అర్థం కాలేదు. తర్వాత కవర్ బయటికి తీసి, న్యాయమూర్తికి చపాతీలను చూపించాడు.
ముందు ఓకే చెప్పి.. ఆ తర్వాత అబ్బాయి ముఖం బాలేదంటూ పెళ్లికి నో చెప్పిన అమ్మాయి.. చివరకు ఎంత ఘోరం జరిగిందంటే..

‘‘జైల్లో ఖైదీలకు పచ్చి చపాతీలు, నాణ్యత లేని ఆహారం పెడుతున్నార్ సార్.. ఈ చపాతీలను జంతువులు కూడా తినవు సర్.. కావాలంటే మీరు ఒకసారి జైల్లోని ఆహారంపై తనిఖీ చేయండి సార్’’.. అని వేడుకున్నాడు. రోజూ నాసిరకం ఆహారం తినలేక అంతా అవస్థలు పడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఖైదీలకు పెడుతున్న ఆహారంపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.