ముందు ఓకే చెప్పి.. ఆ తర్వాత అబ్బాయి ముఖం బాలేదంటూ పెళ్లికి నో చెప్పిన అమ్మాయి.. చివరకు ఎంత ఘోరం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-20T21:23:57+05:30 IST

ఆచార వ్యవహారాలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అనాదిగా కొన్ని ఆచారాలను పాటిస్తుంటారు. అలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంటుంది...

ముందు ఓకే చెప్పి.. ఆ తర్వాత అబ్బాయి ముఖం బాలేదంటూ పెళ్లికి నో చెప్పిన అమ్మాయి.. చివరకు ఎంత ఘోరం జరిగిందంటే..

ఆచార వ్యవహారాలు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అనాదిగా కొన్ని ఆచారాలను పాటిస్తుంటారు. అలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంటుంది. మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో విచిత్ర సాంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయమే చివరకు రెండు కుటుంబాల మధ్య గొడవలకు కారణమైంది. ముందు ఓకే చెప్పిన అమ్మాయి.. తర్వాత అబ్బాయి ముఖం బాలేందుటూ నో చెప్పింది. దీంతో చివరకు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్‌ పరిధి జిరాపూర్ గ్రామానికి చెందిన బబ్లూ తన్వర్‌కు రఘునాథ్‌పురాకు చెందిన బాలికతో వివాహం చేసేలా ఐదేళ్ల క్రితం ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరు కుటుంబాల మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. అయితే అప్పట్లో ఓకే చెప్పిన అమ్మాయి.. ప్రస్తుతం అబ్బాయి బాగోలేడంటూ నో చెప్పింది. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం, బాలికలతో చిన్న వయసులోనే పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు. కొన్నేళ్లు గడిచాక.. ముహర్తం చూసుకుని ఇద్దరికీ వివాహం జరిపిస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వారు.. నష్టపరిహారం చెల్లించి వేరే వారిని వివాహం చేసుకుంటుంటారు.

వరుసకు సోదరిపై ఓ యువకుడు అత్యాచారం.. బెదిరించి భయపెట్టి రెండేళ్లుగా నీచం.. కోర్టు తుది తీర్పులో రూ.12 వేల జరిమానాతోపాటు..


ఈ ఆచారం ప్రకారం.. పెళ్లికి నిరాకరించిన అమ్మాయి కుంటుంబం.. తన్వర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే డబ్బులు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. ఈ విషయమై మంగళవారం ఉదయం రఘునాథ్‌పురా గ్రామంలో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. తన్వర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా... రాజ్‌గఢ్ బస్టాండ్ సమీపంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. కట్టెలు, ఇనుప రాడ్లతో ఒకరినొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తన్వర్‌తో సహా ఐదుగురు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. అమ్మాయి కుటుంబానికి చెందిన 9మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మేం ప్రేమించుకున్నాం.. అని ఆ జంట ముందే చెప్పినా బలవంతంగా ఆ యువతికి వేరే పెళ్లి.. చివరకు పరిస్థితి ఇదీ..!

Updated Date - 2022-07-20T21:23:57+05:30 IST