టికెట్ కొనుగోలు చేసినా ఈ మహిళను విమానం ఎక్కనివ్వలేదు.. అసలు కారణం ఏమిటంటే..

ABN , First Publish Date - 2022-12-29T11:54:21+05:30 IST

ప్రయాణం గురించి వేసుకున్న ప్రణాళికలు మొత్తం ఒక్కదెబ్బకు మారిపోయాయి

టికెట్ కొనుగోలు చేసినా ఈ మహిళను విమానం ఎక్కనివ్వలేదు.. అసలు కారణం ఏమిటంటే..

బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ తాను ఫ్రాన్స్ ఎయిర్ వేస్‌లో ఖతార్‌కు వచ్చింది. ఆమె వృత్తి రీత్యా మోడల్. బీరుట్ నుండి దోహాకు తిరుగు ప్రయాణం చేయడానికి టికెట్ కొనుగోలు చేసింది. అయితే ఆమె ప్రయాణం గురించి వేసుకున్న ప్రణాళికలు మొత్తం ఖతార్ ఎయిర్ వేస్ సిబ్బంది ప్రవర్తనతో ఒక్కదెబ్బకు మారిపోయాయి. దీని గురించి వివరాల్లోకి వెళితే..

జూలియానా అనే బ్రిటీష్ మహిళ తన తల్లి, సోదరి, సోదరి కొడుకుతో కలసి ఖతార్‌కు వచ్చింది. ఆమె తన పని ముగిసిన తరువాత తిరుగు ప్రయాణం కోసం టికెట్లు కొనుగోలు చేసింది. అయితే ఖతార్ ఎయిర్‌పోర్టులో ఆమె విమానం ఎక్కడానికి అక్కడి సిబ్బంది నిరాకరించారు. దీనికి కారణం జూలియానా చాలా లావు ఉండటమే. అక్కడి సిబ్బంది ప్రవర్తనకు జూలియానా చాలా డిజప్పాయింట్ అయ్యింది. వెంటనే ఇన్స్టాగ్రామ్‌లో తనకున్న 1.68వేల మంది ఫాలోయర్స్ ముందు జరిగిన అవమానాన్ని గురించి వివరించింది. ఒక వీడియో తీసి పోస్ట్ చేసింది.

ఆమెను విమానం ఎక్కడానికి నిరాకరించిన కారణం గురించి చెబుతూ ఖతార్ ఎయిర్ వేస్ వివరణ ఇచ్చింది. ‘సదరు మహిళ లావుగా ఉండటం అనే కారణంతో తాము ఆమెను ఆపేసిన సంగతి వాస్తవమే అయినా దానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కేవలం ఖతార్ ఎయిర్ వేస్ మాత్రమే కాదు వేరే ఏ ఎయిర్ వేస్ అయినా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ముఖ్యం. ప్రతి ఎయిర్ వేస్‌కు కొన్ని నియమాలు ఉంటాయి. సదరు మహిళ లావుగా ఉన్నప్పుడు ఆమె కూర్చున్న సీటు ఆమెకు ఏమాత్రం సరిపోదు. అలాంటపుడు ఆమె ప్రక్కన కూర్చున్న ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే లావుగా ఉన్నవారు తమ పక్కనే మరొక సీటును కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మహిళకే కాకుండా ప్రక్క ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే విషయాన్ని సదరు మహిళకు చెప్పినప్పుడు ఆమె ఆ మాటలు వినకపోగా సిబ్బంది విషయంలో తప్పుగా ప్రవర్తించింది. ఖతార్ ఎయిర్ వేస్ ప్రయాణికులను గౌరవంగానే చూస్తుంది. ఇక్కడ ఎవరూ మనిషి భౌతిక రూపాన్ని చూసి గౌరవించరు. టికెట్ ఉంటే ఎవరైనా ప్రయాణం చేయవచ్చు. కానీ ఒకరి వల్ల మరొకరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మా భాద్యత కదా..' అంటూ చెప్పుకొచ్చింది.

చివరికి ఈ బ్రిటన్ మోడల్ తన కోసం అదనంగా మరొక టికెట్ కొనాల్సివచ్చిందట. 'నేను టికెట్ కొన్నాను. లావు ఉన్నా నేనూ మనిషినే కదా..' అని వాదించిన జూలియానా మాటలు అందరికీ నిజమే కదా అనిపించినా.. ఖతార్ ఎయిర్ వేస్ ఇచ్చిన వివరణ కూడా సమంజసంగానే ఉంది అని అనిపించకమానదు. మొత్తానికి జూలియానా ఇబ్బందులు పడినా తిరిగి తన దేశానికి వెళ్ళిపోయి మీ సర్వీస్‌కు దండంరా నాయనా అని ఖతార్ సిబ్బందికి మనసులోనే కోటి నమస్కారాలు చేసి ఉంటుందేమో.

Updated Date - 2022-12-29T14:49:53+05:30 IST