ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక.. మరుక్షణం కంటైనర్‌లో.. ఇంటికి వచ్చాక ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-12-07T20:14:04+05:30 IST

అత్యాచార ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. రోజూ ఎక్కడోచోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా ..

ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక.. మరుక్షణం కంటైనర్‌లో.. ఇంటికి వచ్చాక ఆమె చెప్పింది విని..
ప్రతీకాత్మక చిత్రం

అత్యాచార ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. రోజూ ఎక్కడోచోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా నిందితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలిక సాయంత్రం సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లింది. అయితే మరుక్షణం కంటైనర్‌లో ప్రత్యక్షమైంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

కళ్లల్లో కారం కొట్టి డబ్బులు దోచుకెళ్లారని ఫిర్యాదు.. చివరకు సీసీ కెమెరాలు చూసి ఖంగుతిన్న పోలీసులు..

బీహార్ (Bihar) గయా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన బాలిక (girl) ఇటీవల ఓ రోజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. సాయంత్రం సమయంలో పాలు తాగేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లింది. అయితే అదే సమయంలో ముగ్గురు యువకులు బైకుపై అటుగా వచ్చారు. బాలిక ఒక్కటే ఉండడాన్ని గమనించారు. దగ్గరికి వెళ్లి తుపాకీ చూపించి బెదిరించారు. అనంతరం ఆమెను బైకులో నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఓ కంటైనర్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

పెళ్లి చూపుల్లో యువతి నంబర్ తీసుకున్న యువకుడు.. ఓ రోజు ఫోన్ చేసి ఊరి బయటికి రమ్మని చెప్పి..

విషయం బయట చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే ఇంటికి వచ్చిన బాలిక.. బాధపడుతూ ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. ఏం జరిగిందంటూ ప్రశ్నించారు. దీంతో చివరకు ఆమె జరిగిన దారుణాన్ని వారికి తెలియజేసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులందరి వయస్సు.. 20నుంచి 22 మధ్య ఉంటుందని విచారణలో తెలిసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. బీహార్‌లోని పలు ప్రాంతాల్లో ఇటీవల సామూహిత అత్యాచార ఘటనలు పెరిగిపోయాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఓ మహిళ గొంతులోంచి డాక్టర్లు బయటకు తీసిన ఈ వింత పదార్థమేంటో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

Updated Date - 2022-12-07T20:14:08+05:30 IST