-
-
Home » Prathyekam » The eight year old girl went crying and told the teacher about the incident in the school bathroom In Madhya Pradesh kjr spl-MRGS-Prathyekam
-
పచ్చ చొక్కా అంకుల్ అంటూ.. ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పిన 8 ఏళ్ల బాలిక.. చివరకు..
ABN , First Publish Date - 2022-07-24T21:52:43+05:30 IST
ఆ బాలిక అభం శుభం తెలీని ఎనిమిదేళ్ల చిన్నారి. పాఠశాల, ఇల్లే తన ప్రంపంచం. రోజూ పాఠశాలకు వెళ్లడం, ఇంటికి రాగానే తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండేది. రోజూ..

ఆ బాలిక అభం శుభం తెలీని ఎనిమిదేళ్ల చిన్నారి. పాఠశాల, ఇల్లే తన ప్రంపంచం. రోజూ పాఠశాలకు వెళ్లడం, ఇంటికి రాగానే తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండేది. రోజూ మాదిరే ఆ రోజు కూడా పాఠశాలకు వెళ్లింది. అయితే కలలో కూడా ఊహించని దారుణం పాఠశాలలోనే జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఏడుస్తూ వచ్చిన బాలిక జరిగిన దారుణాన్ని టీచర్‌తో చెప్పింది. ఈ ఘటన బయటికి తెలియడంతో అంతా.. అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగింది.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం భోపాల్ (Bhopal) పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల ఓ బాలిక నాలుగో తరగతి చదువుతోంది. ఈ చిన్నారి ఆరు రోజుల క్రితమే పాఠశాలలో అడ్మిషన్ అయింది. రోజూ పాఠశాలకు వెళ్లడం, ఇంటికి వచ్చి తోటి పిల్లలతో ఆడుకుంటూ సరదాగా ఉండేది. అయితే గత శుక్రవారం పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. మధ్యాహ్న సమయంలో బాలిక.. బాత్‌రూమ్‌కి వెళ్లింది. అక్కడే ఉన్న లక్ష్మీనారాయణ ధనక్ అనే వ్యక్తి బాలికను గమనించాడు. బాలిక ఒక్కటే ఉండడం చూసి.. లోపలికి వెళ్లి, నోరు మూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనతో బాలిక ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. అక్కడి నుంచి ఏడుస్తూ పాఠశాల గదిలోకి వెళ్లింది.
Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..

బాలిక ఏడుస్తుండడంతో టీచర్ ఏమైందంటూ ప్రశ్నించింది. ‘‘పసుపు చొక్కా అంకుల్.. నన్ను నోరు మూసి బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు’’.. అంటూ జరిగిన దారుణాన్ని వివరించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు (CC camera).. వర్షం కారణంగా పని చేయలేదని గుర్తించారు. చివరకు విచారణలో నిందితుడు పాఠశాలలో చెత్త ఊడ్చే పనులు చేసే మహిళ భర్తే అని తెలిసింది. నిందితుడు కుటుంబంతో సహా పాఠశాల వద్దే నివస్తున్నాడు. ఆ బాత్‌రూమ్ ఇటీవలే కొత్తగా నిర్మించారని, బాలిక పాఠశాలకు కొత్త కావడంతో ఆ బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. అక్కడ చీకటిగా ఉండడంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.