1433 Kilometers ప్రయాణించి భర్తను చేరుకున్న మహిళ.. ఇంటి ఎదుట ఏడు రోజులుగా కేవలం నీళ్లు తాగుతూ.. చివరకు రిక్షా డ్రైవర్ గమనించడంతో..

ABN , First Publish Date - 2022-07-23T22:13:17+05:30 IST

అతడిది రాజస్థాన్, ఆమెది కర్ణాటక.. మధ్యవర్తి ద్వారా వివాహం చేసుకున్నారు. ప్రాంతాలు వేరైనా భార్యను ప్రాణంగా చూసుకునేవాడు. చూస్తుండగానే ఐదు నెలలు ఆనందంగా గడిచిపోయాయి..

1433 Kilometers ప్రయాణించి భర్తను చేరుకున్న మహిళ.. ఇంటి ఎదుట ఏడు రోజులుగా కేవలం నీళ్లు తాగుతూ.. చివరకు రిక్షా డ్రైవర్ గమనించడంతో..

అతడిది రాజస్థాన్ (Rajasthan) , ఆమెది కర్ణాటక (Rajasthan) .. మధ్యవర్తి ద్వారా వివాహం చేసుకున్నారు. ప్రాంతాలు వేరైనా భార్యను ప్రాణంగా చూసుకునేవాడు. చూస్తుండగానే ఐదు నెలలు ఆనందంగా గడిచిపోయాయి. తర్వాత వారి కుటుంబంలో సమస్యలు ప్రారంభమయ్యాయి. సొంతూరుకు వెళ్లడమే ఆమె చేసిన తప్పయింది. చివరకు 1433 కిలోమీటర్లు (Kilometers) ప్రయాణించి మళ్లీ భర్తను చేరుకుంది. ఇంటి ఎదుట అన్నం, నీళ్లు లేకుండా ఎదురుచూసింది. అయినా భర్త కనికరించలేదు. చివరకు రిక్షా డ్రైవర్ గమనించడంతో సమస్య.. పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌‌ పరిధి ఠాణాకు చెందిన వ్యాపారవేత్త (businessman) సురేంద్ర జంగిద్ అనే వ్యక్తికి 40ఏళ్లు వచ్చినా వివాహం కాలేదు. తన అన్నయ్యతో కలిసి జోధ్‌పూర్‌లో ఫరీచర్ వ్యాపారం చేసేవాడు. మరోవైపు పెళ్లి ప్రయత్నాలు కూడా చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతడికి మధ్యవర్తి ద్వారా కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన జ్యోతి అనే మహిళ పరిచయమైంది. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఇద్దరికీ నచ్చడంతో 2022 జనవరి 14న జోధ్‌పూర్‌‌లో జ్యోతిని వివాహం చేసుకున్నాడు. ప్రాంతాలు వేరైనా భార్యను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. ఐదు నెలలు ఆనందంగా గడిపారు.

నేరుగా స్టేషన్‌కు వచ్చి.. వెక్కి వెక్కి ఏడుస్తూ 15 ఏళ్ల బాలిక చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఇంటికి వెళ్లి చూస్తే..


అయితే తర్వాత ఏమైందో తెలీదుగానీ జూన్‌లో సొంతూరికి వెళ్లే విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవ జరిగింది. ఆమె పుట్టింటికి వెళ్లడం సురేంద్రకు ఇష్టం లేదు. అయినా ఆమె మాత్రం.. భర్తకు చెప్పకుండా జూన్ 16న రైలు ఎక్కి కర్ణాటకకు వెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి దంపతుల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో జ్యోతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. భర్త మాత్రం స్పందించలేదు. దీంతో జూలై 12న బెల్గాం నుంచి జోధ్‌పూర్‌‌కు బయలుదేరింది. 1433 కిలోమీటర్లు ప్రయాణించి.. ఎట్టకేలకు 15వ తేదీ సాయంత్రానికి భర్త ఇంటికి చేరుకుంది. అయితే భర్త, అత్తమామలు.. ఇంట్లోకి అనుమతించకుండా తలుపులు మూసేశారు.

చనిపోయిందా..? చంపేశారా..? మిస్టరీగా మారిన మహిళ సజీవ దహనం కేసు.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో..


దీంతో ఇంటి ఆవరణలోనే భర్త కోసం ఎదురుచూసింది. ఏడు రోజులుగా అన్నం లేకుండా.. కేవలం కొళాయి నీరు తాగుతూ ఉండేది. ఎన్నిసార్లు పిలిచినా భర్త మాత్రం కనికరించలేదు. చివరకు అత్తమామలు జ్యోతి మెడలోని మంగళసూత్రం కూడా లాక్కెళ్లి.. రోడ్డు మీదకు గెంటేశారు. ఆ సమయంలో ఓ రిక్షా డ్రైవర్ గమనించి, ఆమెను మహిళా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం సురేద్ర కుటుంబ సభ్యులను పిలిపించి విచారించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..



Updated Date - 2022-07-23T22:13:17+05:30 IST