Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..

ABN , First Publish Date - 2022-07-22T21:24:15+05:30 IST

వివాహమనేది జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే ఘట్టం. మరి అలాంటి పెళ్లి వేడుకను ఏదో.. జరిపించాం అన్నట్లుగా కాకుండా.. విందు, వినోదాలతో వినత్నంగా జరుపుకోవాలి...

Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..

వివాహమనేది జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే ఘట్టం. మరి అలాంటి పెళ్లి వేడుకను ఏదో.. జరిపించాం అన్నట్లుగా కాకుండా.. విందు, వినోదాలతో వినత్నంగా జరుపుకోవాలి. ఇందుకోసమే చాలా మంది వివాహ వేడులను విభిన్నంగా నిర్వహిస్తుంటారు. వేదికపైకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి కార్యక్రమంలో ప్రతి ఘట్టాన్ని సరికొత్తగా ప్లాన్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసిన వరుడు.. సిగ్గుతో దాన్ని కనిపించకుండా దాచేస్తాడు. అదే సమయంలో వధువు ఇచ్చిన రియాక్షన్.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. వేదికపైన వధూవరులు ఇద్దరూ పక్కపక్కన కూర్చుని, స్నేహితులను పలకరిస్తూ ఉంటారు. అదే సమయంలో బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా గిఫ్ట్‌లు అందజేస్తుంటారు. ఆ క్షణాలను ఆనందమయం చేయాలని వరుడి స్నేహితులు భావించారు. వెంటనే కవరులో ఓ గిఫ్ట్‌ను ప్యాక్ చేసి, వరుడికి అందజేస్తారు. తమ ముందే దాన్ని ఓపెన్ చేయాలని చెబుతారు. వరుడి పక్కనే ఉన్న వధువు.. ఓవైపు సిగ్గుపడుతూ, మరోవైపు ఆసక్తిగా గమనిస్తుంటుంది. కాసేపటికి వరుడు ఆ కవర్‌ను ఓపెన్ చేసి, అందులో చేయి పెట్టి చూస్తాడు. వెంటనే అందులో ఏమున్నదో తెలిసినట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. దీంతో అతడి స్నేహితులంతా పగలబడి నవ్వుతారు. అయితే ఆ వస్తువును బయటికి తీయకుండా, బలవంతంగా కుర్చీ కింద దాసేస్తాడు. మరోవైపు అందులో ఏముందో తెలిసినట్లుగా.. వధువు సిగ్గుపడుతూ ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

పీటలపై వరుడు.. ఎంతకూ పెళ్లి మంటపానికి చేరుకోని వధువు.. ఫోన్ చేస్తే అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఊహించని సీన్..!





Updated Date - 2022-07-22T21:24:15+05:30 IST