మహిళపై అనుమానం రావడంతో తలుపులు బద్దలు కొట్టిన స్థానికులు.. బెడ్‌ రూమ్‌లో మంచం కింద తనిఖీ చేయగా.. షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2022-07-20T23:36:50+05:30 IST

కొందరు పెద్ద పెద్ద నేరాలు చేసినా.. పైకి మాత్రం అమాయకంగా కనిపిస్తుంటారు. అసలు విషయం బయటపడినప్పుడు.. వారి అసలు స్వరూపం తెలుస్తుంది. ముంబై(Mumbai)లో తాజాగా ఇలాంటి..

మహిళపై అనుమానం రావడంతో తలుపులు బద్దలు కొట్టిన స్థానికులు.. బెడ్‌ రూమ్‌లో మంచం కింద తనిఖీ చేయగా.. షాకింగ్ సీన్..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు పెద్ద పెద్ద నేరాలు చేసినా.. పైకి మాత్రం అమాయకంగా కనిపిస్తుంటారు. అసలు విషయం బయటపడినప్పుడు.. వారి అసలు స్వరూపం తెలుస్తుంది. ముంబై(Mumbai)లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఇంటికి తాళం వేసి అదృశ్యమవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. తలుపులు బద్దలు కొట్టి తనిఖీ చేస్తుండగా.. బెడ్‌ రూమ్‌లో మంచం కింద షాకింగ్ సీన్ కనిపించింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


ముంబయి పరిధి అంధేరీ ఈస్ట్‌లోని సకినాకా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రుబీనా, నసీమ్ ఖాన్(23) దంపతులు స్థానికంగా ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి 2017లో వివాహమైంది. నసీమ్ ఖాన్ టైలరింగ్ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే కుటుంబ పెద్దలు జోక్యం చేసుకుని పరిష్కరించేవారు. ఈ క్రమంలో జూలై 12 నుంచి ఇంటికి తాళం వేశారు. నసీమ్ ఖాన్‌ను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రలు.. ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనుదిరిగి వెళ్లారు.

ఓ కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తికి కోర్టులోనే ఊహించని అనుభవం.. బ్యాగులోంచి ఆ ఖైదీ చపాతీలు తీసి..


జూలై 14న కొడుక్కు ఫోన్ చేయగా.. అందుబాటులో లేకపోవడంతో కోడలికి చేశారు. ‘‘మీ కొడుక్కి అనారోగ్యంగా ఉంది.. ఇంట్లో పడుకుని ఉన్నాడు’’.. అని చెప్పి ఫోన్ కట్ చేసింది. జూలై 15నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. అనుమానం రావడంతో సోమవారం మళ్లీ కొడుకును చూసేందుకు వచ్చారు. కొన్ని రోజులుగా తాళం వేసి ఉండడంతో పాటూ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులకు అప్పటికే రుబీనాపై అనుమానం వచ్చింది.

ముందు ఓకే చెప్పి.. ఆ తర్వాత అబ్బాయి ముఖం బాలేదంటూ పెళ్లికి నో చెప్పిన అమ్మాయి.. చివరకు ఎంత ఘోరం జరిగిందంటే..


అంతా కలిసి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. బెడ్‌ రూమ్‌లో మంచం కింద తనిఖీ చేయగా..  నసీమ్ ఖాన్ మృతదేహం పడి ఉంది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న రుబీనా కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

వరుసకు సోదరిపై ఓ యువకుడు అత్యాచారం.. బెదిరించి భయపెట్టి రెండేళ్లుగా నీచం.. కోర్టు తుది తీర్పులో రూ.12 వేల జరిమానాతోపాటు..Read more