Shocking: స్టేజ్ మీద రామకథ చెబుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-10-24T15:38:33+05:30 IST

హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా రామాయణాన్ని వినిపిస్తున్న ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ (Retired Professor) స్టేజిపైనే కుప్పకూలిపోయాడు.

Shocking: స్టేజ్ మీద రామకథ చెబుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్.. వైరల్ అవుతున్న వీడియో!

ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్‌ (Heart attack)లతో హఠాత్తుగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పది రోజుల క్రితం నాటకంలో శివుడి పాత్ర పోషిస్తున్న వ్యక్తి వేదిక మీదే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తాజాగా బీహార్‌ (Bihar)లో ఓ ఘటన జరిగింది. హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా రామాయణాన్ని వినిపిస్తున్న ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ (Retired Professor) స్టేజిపైనే కుప్పకూలిపోయాడు. రాముడి కథ చెబుతూ గుండె పోటుకు గురై కుప్పకూలాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది.

బీహార్‌లోని చాప్రా నగరంలోని మారుతీ మానస్ ఆలయంలో హనుమాన్‌ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ ఆలయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రిటైర్డ్ ప్రొఫెసర్ రంజయ్ సింగ్‌ శనివారం భక్తులకు రామకథను వివరించారు. రాముడి గుణ, గణాలను వివరిస్తుండగా ఆయనకు గుండె పోటు వచ్చింది. దీంతో చేతిలో మైక్‌తోనే ఆయన వెనక్కి పడిపోయాడు. అక్కడ ఉన్న వారు ఆయణ్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రంజయ్ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

Updated Date - 2022-10-24T15:38:35+05:30 IST