ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా.. కట్నంగా కారు కొనివ్వడం లేదని మరీ ఇంత నీచమా..? భార్య వీడియోలను..!

ABN , First Publish Date - 2022-12-12T15:11:31+05:30 IST

ఆ యువతికి రెండేళ్ల క్రితం ఓ యువకుడితో వివాహమైంది. ఆ యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో యువతి కుటుంబ సభ్యులు వరుడికి కట్నంతోపాటు బుల్లెట్ కూడా ఇచ్చారు. పెళ్లయిన ఆరు నెలల వరకు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత వేధింపులు మొదలయ్యాయి.

ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా.. కట్నంగా కారు కొనివ్వడం లేదని మరీ ఇంత నీచమా..? భార్య వీడియోలను..!

ఆ యువతికి రెండేళ్ల క్రితం ఓ యువకుడితో వివాహమైంది. ఆ యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో యువతి కుటుంబ సభ్యులు వరుడికి కట్నంతోపాటు బుల్లెట్ కూడా ఇచ్చారు. పెళ్లయిన ఆరు నెలల వరకు అంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాత యువతికి వేధింపులు (Dowry Harassment) మొదలయ్యాయి. కట్నంగా కారు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేశాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గ్వాలియర్‌కు సమీపంలోని దాతియ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతికి రెండేళ్ల క్రితం 27 ఏళ్ల యువకుడితో వివాహం జరిగింది. వివాహ సమయంలో యువతి కుటుంబ సభ్యులు వరుడికి కట్నంతోపాటు బుల్లెట్ కూడా ఇచ్చారు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత యువతికి వేధింపులు మొదలయ్యాయి. బైక్ తీసుకుని కారు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో శారీరకంగా దాడి చేశాడు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి చెప్పింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి భర్తపై గృహహింస కేసు పెట్టింది.

గృహహింస కేసును ఉపసంహరించుకోవాలని భార్యపై భర్త ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తమ పడకగది చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టాడు. బెడ్రూమ్‌లో భార్య నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను ఆమె బంధువులకు, స్నేహితులకు పంపించాడు. అంతేకాదు వాటిని ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేశాడు. ఆ మహిళ తన భర్త చేస్తున్న పనుల గురించి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి గురించి గాలిస్తున్నారు.

Updated Date - 2022-12-12T15:11:31+05:30 IST

Read more