FIFA World Cup 2022: మరీ ఇంత పిచ్చా.. కొచ్చిలో ఫుట్‌బాల్ క్రీడాభిమానులు ఏం చేశారంటే.. రూ.23లక్షలతో!

ABN , First Publish Date - 2022-11-24T12:48:51+05:30 IST

భారత్‌లోని ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. వాళ్లకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు

FIFA World Cup 2022: మరీ ఇంత పిచ్చా.. కొచ్చిలో ఫుట్‌బాల్ క్రీడాభిమానులు ఏం చేశారంటే.. రూ.23లక్షలతో!

ఇంటర్నెట్ డెస్క్: ఖతర్ వేదికగా సాకర్ 2022 పోటీలు మొదలయ్యాయి. వరల్డ్ కప్ కోసం బరిలో నిలిచిన జట్లు.. నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లోని ఫుట్‌బాల్ క్రీడాభిమానులకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. వాళ్లకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకూ విషయం ఏంటంటే..

FIFA World Cup 2022 మ్యాచ్‌లను వీక్షించేందుకు కేరళలోని కొచ్చి ప్రాంతంలోని ముండకముగల్(Mundakamugal)‌లో 17 మంది స్నేహితులు రూ.23లక్షలు వెచ్చించి ఏకంగా ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, పోర్చుగీస్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోలతోపాటు పోటీలో పాల్గొంటున్న దేశాల జాతీయ జెండాలతో ఆ ఇంటిని అలంకరించారు.

ఈ సందర్భంగా స్నేహితుల బృందంలోని ఒక సభ్యుడు మాట్లాడుతూ.. ‘గత 15ఏళ్లుగా మేమంతా ఈ ఇంటి వద్ద సాయంత్రం సమయంలో సమావేశం అవుతున్నాం. ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్.. ఈ ఇల్లును అమ్మాలనుకుంటున్నట్టు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ ఇంటిని మేమే కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాం. FIFA World Cup 2022 నేపథ్యంలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి అందరం ఇక్కడే మ్యాచ్‌లను ఎంజాయ్ చేయాలని భావించాం. అందుకే రూ.23లక్షలు ఖర్చు చేసి ఇంటిని కొనుగోలు చేశాం. మా తర్వాత భవిష్యత్తు తరాలు కూడా ఇక్కడే మ్యాచ్‌లను ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. అంతేకాదు రకరకాల సేవా కార్యక్రమాలు, ఎమర్జెన్సీ సర్వీసులను అందించే విధంగా ఈ ఇంటిని మరమ్మత్తులు చేయాలి అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-24T13:41:29+05:30 IST