Adivi Sesh: అడివి శేష్ 'హిట్ 2' కలెక్షన్స్ ఎంతో చూసారా...

ABN , First Publish Date - 2022-12-05T13:09:27+05:30 IST

గత వారం అడివి శేష్ నటించిన 'హిట్ 2' విడుదల అయింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ అని చెప్పొచ్చు.

Adivi Sesh: అడివి శేష్ 'హిట్ 2' కలెక్షన్స్ ఎంతో చూసారా...
Adivi Sesh, Nandamuri Balakrishna, Sailesh Kolanu, Nani after a special screening of HIt 2 at Prasad Preview Theatre.

అడివి శేష్ ఒక వైవిధ్యమయిన నటుడు, తనకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుంటూ తన ఇమేజ్ ని, అలాగే తన సినిమాల (Hit 2 collections) అంచనాలను ఒకదాని తరువాత మరొకటి పెంచుకుంటూ వెళుతున్నాడు. గత వారం అడివి శేష్ నటించిన 'హిట్ 2' విడుదల అయింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ అని చెప్పొచ్చు. (Adivi Sesh film 'Hit 2' collections) మంచి హిట్ టాక్ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు మూడు రోజుల కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కూడా అయింది అని అంటున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ 'హిట్ 2' లో అడివి శేష్ సెకండ్ కేసు పరిశోధన చేసే అధికారిగా కనపడతాడు. ఇది ఒక ఫ్రాంచైజ్ గా చెయ్యాలని ఇంక వరసగా ఈ 'హిట్' సినిమాలు ఒక ఏడూ ఎనిమిది వరకు వస్తాయి అని దర్శకుడు చెప్పాడు. (The three day collections are nearly Rs 28.1 crore gross which is best for a Adivi Sesh film and the film is also into profits now)

hit-nbk1.jpg

తన నటనతో అందరిని మెప్పించిన అడివి శేష్ ఈ హిట్ లో కూడా శబాష్ అనేట్టు నటించాడు. ఈ సినిమాని ప్రముఖ నటుడు నాని నిర్మించగా మొత్తం మూడు రోజులకు 28.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా చాలా బలంగా బాక్స్ ఆఫీస్ లో నిలబడింది. (Popular actor Nani is the producer and Sailesh Kolanu is the director)ఈ సినిమాని ముఖ్యంగా యువత చూస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కధానాయికగా నటించింది. ఆదివారం నాడు ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కూడా చూసి చాలా బాగుంది అని చెప్పటం తో సినిమాకి మరింత హైప్ వచ్చిందని సమాచారం. ఇప్పటికే కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా అడివి శేష్ కెరీర్ లో బెస్ట్ అవుతుందని అని ట్రేడ్ పండితుల అభిప్రాయం. (Nandamuri Balakrishna has seen the film at a special screening and says about it in one word 'Mindblowing').

Updated Date - 2022-12-05T13:09:29+05:30 IST