Shocking Package: ఎయిర్‌పోర్టులో పార్సిల్ స్కాన్ చేసి నిన్వెరపోయిన అధికారులు.. ఏకంగా నాలుగు దొరికాయ్..

ABN , First Publish Date - 2022-12-31T12:20:35+05:30 IST

ఎయిర్‌పోర్టుల (Airports) వద్ద పకడ్బంధీ తనిఖీలు ఉంటాయి. పార్సిల్ (Parcel) ఏదైనా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు కదలనిస్తారు.

Shocking Package: ఎయిర్‌పోర్టులో పార్సిల్ స్కాన్ చేసి నిన్వెరపోయిన అధికారులు.. ఏకంగా నాలుగు దొరికాయ్..

క్వెటెటరో: ఎయిర్‌పోర్టుల (Airports) వద్ద పకడ్బంధీ తనిఖీలు ఉంటాయి. పార్సిల్ (Parcel) ఏదైనా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు కదలనిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఏమీ తీసుకెళ్లకుండా అడ్డుకుంటుంటారు. ఈ రోటిన్ నిబంధనల్లో భాగంగా సెంట్రల్ మెక్సికోలోని క్వెటెటరో ఇంటర్‌కాంటినెంటల్ ఎయిర్‌పోర్టులో (Queretaro Intercontinental Airport) ఒక పార్సిల్‌ను స్కాన్ చేసిన అధికారులు నివ్వెరపోయారు. ఆ ప్యాకేజీలో 1 కాదు.. 2 కాదు.. ఏకంగా 4 మానవ కపాలాలను (Skulls) గుర్తించారు.

Untitled-3.jpg

అల్యూమినియం పేపర్లో చుట్టి ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో కపాలాలను పార్సిల్ చేసి పంపించారు. అమెరికాలోని కరోలినాకు పంపించేందుకు ఓ కొరియర్ సంస్థ వీటిని ఎయిర్‌పోర్టుకు చేర్చినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు. మెక్సికో పశ్చిమ ప్రాంతంలో అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటైన మిచోకన్ నుంచి ఈ పార్సిల్‌ను పంపించారు. అమెరికాలోని దక్షిణ కరోలినాలోని ఒక అడ్రస్‌కు పంపించేందుకు ప్రయత్నించారని ‘నేషనల్ గార్డ్’ అనే మీడియా రిపోర్టు పేర్కొంది. అయితే కపాలాలను పంపించడం వెనుకున్న ఉద్దేశ్యం ఏంటనేది తెలియరాలేదని వివరించింది. ఈ ఘటనలో ఇంతకుమించిన సమాచారం ఏమీ వెల్లడికాలేదని వివరించింది.

Updated Date - 2022-12-31T12:39:22+05:30 IST