బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టిన 12రోజుల తర్వాత.. అటుగా వెళ్తున్న స్థానికులకు కనిపించిన దృశ్యం..
ABN , First Publish Date - 2022-10-27T21:40:03+05:30 IST
మూఢనమ్మకాలతో కొందరు చేసే పనులు.. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంటాయి. ఉన్నట్టుండి కోట్ల రూపాయలు సంపాదించాలనే దురుద్దేశంతో మనుషులను బలిచ్చే వారు కొందరైతే.. పునర్జన్మలను నమ్మి ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడేవారు ఇంకొందరు ఉంటారు. తమిళనాడులో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక..
మూఢనమ్మకాలతో కొందరు చేసే పనులు.. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంటాయి. ఉన్నట్టుండి కోట్ల రూపాయలు సంపాదించాలనే దురుద్దేశంతో మనుషులను బలిచ్చే వారు కొందరైతే.. పునర్జన్మలను నమ్మి ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడేవారు ఇంకొందరు ఉంటారు. తమిళనాడులో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక ప్రమాదవశాత్తు మృత్యువాత పడింది. ఆమె మృతదేహాన్ని ఖననం చేసిన 12రోజుల తర్వాత.. అటుగా వెళ్తున్న స్థానికులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
26 ఏళ్ల క్రితం చేసిన వీర్యదానం.. 47 ఏళ్ల వయసులో అతడిని ఓ బిడ్డకు తండ్రిని చేసింది..!
చెన్నై (Chennai) చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో రెండువారాల క్రితం శ్మశానంలో ఖననం చేసిన బాలిక మృతదేహం తల మాయమైంది. దుండగులు తల నరికి తీసుకెళ్లడం సంచలనం రేపుతోంది. ఆ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో సూర్యగ్రహణం రోజు తాంత్రికులు అక్కడ క్షుద్రపూజలు చేసి వుంటారని అనుమానిస్తున్నారు. పూజల అనంతరం బాలిక శవం నుంచి తల వేరు చేసి తీసుకెళ్లి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
310 అడుగుల ఎత్తులో ముద్దులు పెట్టుకుంటూ ఫొటో తీసుకున్న జంట.. మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా..
మధురాంతకం చిత్తిరవాడి గ్రామానికి చెందిన పాండ్యన్ కుమార్తె కృత్తిక (12) అక్టోబర్ 5న విద్యుత్ స్తంభం (Electrical hazards) కూలిపడటంతో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14న మృతి చెందింది. కుటుంబీకులు 15న బాలిక మృతదేహాన్ని గ్రామ శివారులోని శ్మశానవాటికలో ఖననం చేశారు. ఈ నేపథ్యంలో 27న బాలిక సమాధి తవ్వినట్లు ఉండడం, అక్కడ తాంత్రిక పూజలు (worship) జరిగినట్లు ఆనవాళ్లు ఉండడంతో స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. సమాధిని పరిశీలించగా, మృతదేహం తల నరికి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
మతిమరుపు తెచ్చిన అదృష్టం.. 67ఏళ్ల వయసులో కోటీశ్వరుడు ఎలా అయ్యాడంటే..