-
-
Home » Prathyekam » A young man who was angry that he was talking to his girlfriend and behaved badly towards his friend In Muzaffarnagar Uttar Pradesh kjr spl-MRGS-Prathyekam
-
స్నేహితుడి ప్రియురాలితో ఫోన్లో మాట్లాడటమే ఆ యువకుడి పాలిట శాపమయింది.. అతడు కలలో కూడా ఊహించని రీతిలో..!
ABN , First Publish Date - 2022-10-18T21:07:08+05:30 IST
వారిద్దరూ మంచి స్నేహితులు. వారి మధ్య ఎలాంటి సమస్యలూ లేవనుకుంటున్న సమయంలో అనుకోని సమస్య తలెత్తంది. స్నేహితుడి ప్రియురాలితో అతడు మాట్లాడంతో వారి మధ్య గొడవలు..

వారిద్దరూ మంచి స్నేహితులు. వారి మధ్య ఎలాంటి సమస్యలూ లేవనుకుంటున్న సమయంలో అనుకోని సమస్య తలెత్తంది. స్నేహితుడి ప్రియురాలితో అతడు మాట్లాడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు రోజు రోజుకూ ఎక్కువవడంతో పాటూ డబ్బు సమస్య కూడా అదనంగా తోడయింది. ఈ కారణంగా అంతవరకూ వారి మధ్య ఉన్న స్నేహం కాస్తా.. శత్రుత్వంగా మారింది. చివరకు ఎవరూ ఊహించని విధంగా దారుణం జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముజఫర్‌నగర్ జిల్లా మన్సూర్‌పూర్ ప్రాంతానికి చెందిన విశాల్, ప్రియాంషు అనే యువకులు మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి అభిమానం ఉండడంతో వారి మధ్య ఎలాంటి సమస్యలూ ఉండేవి కావు. ఈ క్రమంలో ప్రియాంషు వద్ద విశాల్.. నగదు అప్పుగా కూడా తీసుకున్నాడు. ఇలా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని సమస్య వచ్చిపడింది. విశాల్‌కు ఓ ప్రియురాలు (girlfriend) ఉండేది.. ఇటీవల ఆమెతో ప్రియాంషు స్నేహంగా ఉండేవాడు. కొన్నాళ్లకు ఫోన్లలో కూడా మాట్లాడుకునే వారు. కొన్నాళ్లకు ఈ విషయం విశాల్‌కు తెలిసింది. తన ప్రియురాలితో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ప్రియాంషుతో గొడవపడ్డాడు. ఇంకోసారి మాట్లాడవద్దంటూ హెచ్చరించాడు.
తమ్ముడితో వెళ్లిపోయిన ప్రియురాలు.. కొన్నాళ్లకు తండ్రితో కలిసి ఆమె వద్దకు వెళ్లిన ప్రియుడు.. అంతా షాక్ అయ్యేలా..
అయితే ప్రియాంషు మాత్రం అప్పుడప్పుడూ ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. దీంతో ప్రియాంషుపై విశాల్.. పగ పెంచుకున్నాడు. దీంతో పాటూ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్యా గొడవలు (quarrels) కూడా జరిగేవి. దీంతో అంత వరకూ మంచి స్నేహితులుగా ఉన్న వీరు.. ఒక్కసారిగా బద్ధ శత్రువుల్లా మారిపోయారు. ఎలాగైనా ప్రియాంషును అంతమొందించాలని విశాల్ కుట్రపన్నాడు. ఇటీవల ఓ రోజు ప్రియాంషుకు ఫోన్ చేసి, ఊరి బయటకు రమ్మన్నాడు. అప్పటికే విశాల్‌తో పాటూ అతడి స్నేహితుడు ధర్మేంద్ర కూడా ఉన్నాడు. అక్కడికి వెళ్లిన ప్రియాంషుపై కత్తులతో విచక్షణారహితంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామ సమీపంలోని చెరువు వద్ద పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నారు.