బయటికెళ్లిన వైద్యుడు.. చికిత్స కోసం వచ్చిన వ్యాపారి.. ఆపరేషన్ థియేటర్‌లో భార్య చేసిన పనికి..

ABN , First Publish Date - 2022-10-17T03:11:55+05:30 IST

కొన్నిసార్లు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే.. అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. కొందరు నకిలీ సర్టిఫికెట్లతో (Fake certificates) క్లినిక్‌లు ఏర్పాటు చేసి, రోగుల ప్రాణాలతో చెలగాటం..

బయటికెళ్లిన వైద్యుడు.. చికిత్స కోసం వచ్చిన వ్యాపారి.. ఆపరేషన్ థియేటర్‌లో భార్య చేసిన పనికి..
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే.. అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. కొందరు నకిలీ సర్టిఫికెట్లతో (Fake certificates) క్లినిక్‌లు ఏర్పాటు చేసి, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఇంకొందరు వచ్చీరాని వైద్యంతో చికిత్స చేసి రోగుల ప్రాణాలు తీస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. అయితే ఒడిశాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో వైద్యుడు లేని సమయంలో ఓ వ్యాపారి చికిత్స కోసం వెళ్లాడు. ఆ సమయంలో వైద్యుడి భార్య ఒక్కటే ఉంది. చివరకు భర్తకు తెలీకుండా భార్య చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..


ఒడిశా (Odisha) మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన తపస్ పాల్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో శుక్రవారం కలిమెలలో ఉంటున్న వైద్యుడు రవీంద్రనాథ్ బిస్వాస్ క్లినిక్‌కు వెళ్లాడు. అయితే ఆ సమయంలో వైద్యుడు బయటికి వెళ్లాడు. క్లినిక్‌లో వైద్యుడి భార్య మాత్రమే ఉంది. వ్యాపారి సమస్య తెలుసుకున్న ఆమె.. తాను కూడా చికిత్స చేస్తానని చెప్పింది. అనంతరం వ్యాపారిని ఆపరేషన్ థియేటర్‌కి (Operation theatre) తీసుకెళ్లి పరీక్షించింది. ఏమాత్రం అవగాన లేకుండా పన్ను పీకేసింది.

తమ్ముడితో వెళ్లిపోయిన ప్రియురాలు.. కొన్నాళ్లకు తండ్రితో కలిసి ఆమె వద్దకు వెళ్లిన ప్రియుడు.. అంతా షాక్ అయ్యేలా..


దీంతో వెంటనే అతడికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం మెరుగైన చికత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు డయాబెటిక్ (Diabetic), రక్తపోటుతో ( blood pressure) బాధపడుతున్నట్లు తెలిసింది. వైద్యంపై అవగాహన లేని వైద్యుడి భార్య.. అతడికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే పన్ను పీకేసినట్లు తెలిసింది.  వ్యాపారి మృతి వార్త తెలియగానే.. వైద్యుడు, అతడి భార్య పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ వార్త స్థానికంగా  తీవ్ర చర్చనీయాంశమైంది.

500మీటర్ల దూరం వరకూ.. యువతిని ఆటోలో తీసుకెళ్లిన డ్రైవర్.. ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో.. చివరకు..



Updated Date - 2022-10-17T03:11:55+05:30 IST