తమ్ముడితో వెళ్లిపోయిన ప్రియురాలు.. కొన్నాళ్లకు తండ్రితో కలిసి ఆమె వద్దకు వెళ్లిన ప్రియుడు.. అంతా షాక్ అయ్యేలా..

ABN , First Publish Date - 2022-10-17T01:05:03+05:30 IST

కొందరు తప్పులు చేసినా చివరకు పశ్చాత్తాపం చెంది సక్రమంగా జీవిస్తుంటారు. మరికొందరు తెలిసి కూడా తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే చాలా మంది చేసే..

తమ్ముడితో వెళ్లిపోయిన ప్రియురాలు.. కొన్నాళ్లకు తండ్రితో కలిసి ఆమె వద్దకు వెళ్లిన ప్రియుడు.. అంతా షాక్ అయ్యేలా..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు తప్పులు చేసినా చివరకు పశ్చాత్తాపం చెంది సక్రమంగా జీవిస్తుంటారు. మరికొందరు తెలిసి కూడా తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే చాలా మంది చేసే తప్పులు అంతా ఛీదరించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఉంటాయి. ఇలాంటి వారికి కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ.. వంటివి ఏవీ పట్టవు. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్త తప్పులు చేసి చివరకు పిల్లలను అనాథలను చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. చెన్నైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ భర్తకు తెలీకుండా పరాయి యువకుడిని ప్రేమించింది. అంతటితో ఆగకుండా అతన్ని వదలేసి తమ్ముడితో పారిపోయింది. దీంతో చివరకు తండ్రితో కలిసి ఆమె వద్దకు వెళ్లిన ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..


చెన్నై (Chennai) అరియలూరు జిల్లా తాపలూర్‌కు చెందిన శక్తివేల్ అనే వ్యక్తికి భార్య సత్య (30), ఇద్దరు కుమారులు ఉన్నారు. శక్తివేల్ స్థానికంగా కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భార్య, పిల్లలకు ఎలాంటి లోటు రానిచ్చేవాడు కాడు. అయితే భార్య మాత్రం భర్తపై చూపించాల్సిన ప్రేమను.. పరాయి మగవారిపై చూపించింది. మేల్‌కుడికాడు గ్రామానికి చెందిన అమృతరాజ్ అనే యువకుడితో సత్యకు ఇటీవల పరిచయం ఏర్పడింది. భర్తకు తెలీకుండా అతడితో రాసలీలలు సాగించేది. కొన్నాళ్లకు అతడితో పాటూ వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సత్య భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దంటూ సత్యను తన భర్త శక్తివేల్‌తో పాటూ పంపించారు. అంతటితో తప్పు తెలుసుకుని భర్తతో సంతోషంగా ఉండాల్సిన సత్య.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.

500మీటర్ల దూరం వరకూ.. యువతిని ఆటోలో తీసుకెళ్లిన డ్రైవర్.. ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో.. చివరకు..


ప్రియుడు అమృతరాజ్‌ను వదిలేసి అతడి తమ్ముడు దేవా అనే యువకుడితో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగించింది. ఇటీవల అతడితో కలిసి పారిపోయింది. భార్య రెండోసారి కూడా వెళ్లిపోవడంతో భర్త శక్తివేల్ తీవ్ర మనస్థాపానికి గరయ్యాడు. తర్వాత  పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి ఉపాధి నిమిత్తం మలేషియా వెళ్లిపోయాడు. ఇదిలావుండగా, గతంలో  అమృతరాజ్ తన ప్రియురాలు సత్యకు పలుమార్లు డబ్బులు ఇచ్చాడు. ప్రస్తుతం తన తమ్ముడితో వెళ్లిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే డబ్బుల విషయంలోనూ ఆమెతో పలుమార్లు గొడవ జరిగింది. దీంతో చివరకు ఎలాగైనా సత్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి దేవేంద్రన్‌తో కలిసి ప్రియురాలు సత్య వద్దకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై తండ్రీకొడుకులు కత్తితో దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. అమృతరాజ్, అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 

ఇదెక్కడి చోద్యం.. ట్యూషన్‌కి వచ్చిన యువతిని భర్త వద్దకు తీసుకెళ్లిన భార్య.. తనకు ఇష్టం లేకున్నా ఒప్పుకోవాల్సిందే అంటూ..



Updated Date - 2022-10-17T01:05:03+05:30 IST