Viral Video: మేలిముసుగులో ఉన్న వధువును చూసి చప్పట్లు కొట్టిన తాత.. చివర్లో అసలు ట్విస్ట్ తెలిసి..

ABN , First Publish Date - 2022-11-14T16:19:18+05:30 IST

సోషల్ మీడియాలో రోజూ వందల కొద్దీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేస్తుంటాయి. ప్రేమికులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..

Viral Video: మేలిముసుగులో ఉన్న వధువును చూసి చప్పట్లు కొట్టిన తాత.. చివర్లో అసలు ట్విస్ట్ తెలిసి..

సోషల్ మీడియాలో రోజూ వందల కొద్దీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేస్తుంటాయి. ప్రేమికులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వృద్ధ జంటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మేలిముసుగులో ఉన్న వధువును చూసి తాత.. ఆనందంలో చప్పట్లు కొట్టాడు. దగ్గరికి వెళ్లి చూసి మరింత మురిసిపోయాడు.

Viral Video: ఈ జర్మన్ యువతి.. మన దేశ పొలంలో చేస్తున్న పని చూస్తే.. శభాష్ అంటారు..

ఇన్‌స్టాగ్రామ్‍‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. ఓ తాత ఓ తాత గారు అడుగులో అడుగేసుకుంటూ హాల్లోకి వచ్చారు. అక్కడ సోఫాలో మేలిముసుగులో ఉన్న వధువుని (bride) చూసి ఆనందం ఆపుకోలేక చప్పట్లు కొట్టారు. అక్కడ పెళ్లికూతురు వేషంలో ఉంది మరెవ్వరో కాదు, ఆయన అర్ధాంగే. తర్వాత దగ్గరగా వెళ్లి, పెళ్లి దుస్తుల్లో సిగ్గుపడిపోతున్న భార్యను చూసి తాత కూడా ఎంతో మురిసిపోతాడు. ఆమెను పెళ్లికూతురులా ముస్తాబు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాడు. ఈ వయసులోనూ ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులను చూసి.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో వైరల్ అయ్యింది.

సహోద్యోగితో యువకుడి ప్రేమాయణం.. అసలు విషయం తెలుసుకున్న యువతి.. ఓ రోజు మూడో అంతస్తులో..

Updated Date - 2022-11-14T16:20:49+05:30 IST