Viral Video: అమ్మబాబోయ్.. ఇతని ఓవర్ యాక్షన్ చూసి పక్కనున్న కోతి కూడా జడుసుకుంది..!

ABN , First Publish Date - 2022-11-10T21:24:28+05:30 IST

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో వాటికే తెలీదు. అంత వరకూ సైలెంట్‌గా ఉన్న కోతులు (Monkeys)... ఉన్నట్టుండి మనుషులపై దాడులు చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అందుకే..

Viral Video: అమ్మబాబోయ్.. ఇతని ఓవర్ యాక్షన్ చూసి పక్కనున్న కోతి కూడా జడుసుకుంది..!

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో వాటికే తెలీదు. అంత వరకూ సైలెంట్‌గా ఉన్న కోతులు (Monkeys)... ఉన్నట్టుండి మనుషులపై దాడులు చేయడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అందుకే వీటితో ఎందుకొచ్చిన సమస్య అనుకుని.. వాటి జోలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కొన్ని కోతులు, కొండముచ్చులను చూస్తేనే.. పారిపోవాలని అనిపిస్తుంది. కానీ మనుషులను చూసి కోతులు జడుసుకోవడం ఎప్పుడైనా చూశారా.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే. అమ్మబాబోయ్! అని మీరే అంటారు.

Viral Video: యువతిపై ప్రేమ కురిపించిన పులి.. వామ్మో!.. మరీ ఇంతాగానా..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి తలకు మంకీ క్యాప్ పెట్టుకుని కూర్చుని ఉంటాడు. పక్కనే ఓ మంకీ కూడా కూర్చుని ఉంటుంది. యువకుడి భుజంపై చేయి వేసి ఓదారుస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆ వ్యక్తి తన తల మీద ఉన్న క్యాప్‌ను తీసేస్తాడు. దీంతో అతడి జుట్టు మొత్తం ఒక్కసారిగా నిక్కపొడుచుకుని ఉంటుంది. అతడి వింత హెయిర్ స్టైల్ చూసి ఆ కోతి జడుసుకుంటుంది. ఓరి నాయనో..! ఇదేం జుట్టురా నాయనా.. నన్నే మించిపోయావ్.. అన్నట్లుగా షాక్ అయి, మూర్చపోయినట్లు పడుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. హెయిర్ చూపించి.. కోతిని కూడా భయపెట్టావ్ కదారా బాబూ... అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: బైక్‌‌పై వెళ్తూ ప్రేయసి ఇన్‌స్టా రీల్స్.. సడన్‌గా వెనక్కు తిరిగిన ప్రియుడికి మైండ్‌బ్లాక్..!

Updated Date - 2022-11-10T21:24:32+05:30 IST