Viral Video: కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన రిషి సునాక్ కూతురు.. శభాష్ అంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-11-27T10:40:39+05:30 IST

భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak) బ్రిటన్ ప్రధానిగా (UK PM)ఎన్నికై చరిత్ర సృష్టించారు. తద్వారా ఈ పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుకెక్కారు.

Viral Video: కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన రిషి సునాక్ కూతురు.. శభాష్ అంటున్న నెటిజన్లు!

లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi Sunak) బ్రిటన్ ప్రధానిగా (UK PM)ఎన్నికై చరిత్ర సృష్టించారు. తద్వారా ఈ పదవిని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుకెక్కారు. లిజ్ ట్రస్ ప్రధానిగా వైదొలగడంతో రిషికి ఈ అవకాశం దక్కింది. ఇక బ్రిటన్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. దాంతో దేశాన్ని గాడిలో పెట్టేందుకు రిషి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. రిషి సునాక్ యూకే ప్రధాని కాకముందు నుంచే ఆయన ఫ్యామిలీకి ఆ దేశంలో మంచి పాపులారిటీ ఉంది. రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి బ్రిటన్‌లోని సంపన్నుల్లో ఒకరు. అలాగే తాజాగా 'ఆసియన్ రిచ్ లిస్ట్ 2022'లో తొలిసారిగా చోటు కూడా దక్కించుకున్నారు. 790 మిలియన్ పౌండ్ల సంపదతో అక్షతా మూర్తి ఈ జాబితాలో 17వ స్థానాన్ని సంపాదించారు. ఇక ఆయన కుమార్తెలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్‌లకు కూడా స్టార్ కిడ్స్‌గా బ్రిటన్‌లో పేరుంది.

Rishi-Sunak-Daughter.jpgఈ నేపథ్యంలో ‘‘రంగ్ – ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022’’లో (Kuchipudi Dance festival - Rang 2022) రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ (Anoushka Sunak) శుక్రవారం పలువురు చిన్నారులతో కలిసి భారతీయ సంప్రదాయ నృత్యమైన కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. ఎంతో చక్కగా నృత్యం చేసి అందరిని ఆకట్టుకుంది. దీని తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దాంతో నెటిజన్లు అనౌష్క ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు. భారతీయ మూలాలను మరవలేదని, శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌లో 4 నుంచి 85 ఏళ్ల వయసు గల వందమంది వరకు కళాకారులు పాల్గొనడం జరిగింది. వారందరి ముందు ఎలాంటి భయం, బిడియం లేకుండా తొమ్మిదేళ్ల అనౌష్క చక్కటి ప్రదర్శన ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమానికి రిషి సునాక్ సతీమణి అక్షత, ఆయన తల్లిదండ్రులు హాజరయ్యారు.

Updated Date - 2022-11-29T07:09:05+05:30 IST