Joe Biden: బైడెన్ సీక్రెట్స్.. ‘ఆ విషయంలో నన్ను నా కుమారులే ప్రోత్సహించారు.. జీవితంలో రెండు సార్లే’

ABN , First Publish Date - 2022-12-28T17:29:21+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(America President Joe Biden) ఏదో విధంగా ప్రతి రోజూ వార్తల్లో ఉంటారు. ‘బైడెన్ ఇవాళ ఆ దేశ అధ్యక్షడితో సమావేశం అయ్యారు. రేపు అక్కడ పర్యటిస్తారు. టెర్రరిజంపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు’ బైడెన్ గురించి ఎక్కువగా ఇటువంటి వార్తలే వింటుంటాం కదా. కానీ ఇప్పుడు రొటీన్‌కు భిన్నంగా ఆయనకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను..

Joe Biden: బైడెన్ సీక్రెట్స్.. ‘ఆ విషయంలో నన్ను నా కుమారులే ప్రోత్సహించారు.. జీవితంలో రెండు సార్లే’

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(America President Joe Biden) ఏదో విధంగా ప్రతి రోజూ వార్తల్లో ఉంటారు. ‘బైడెన్ ఇవాళ ఆ దేశ అధ్యక్షడితో సమావేశం అయ్యారు. రేపు అక్కడ పర్యటిస్తారు. టెర్రరిజంపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు’ బైడెన్ గురించి ఎక్కువగా ఇటువంటి వార్తలే వింటుంటాం కదా. కానీ ఇప్పుడు రొటీన్‌కు భిన్నంగా ఆయనకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను తెలుసుకుందాం. కాగా.. జో బైడెన్ జీవితంలో చోటు చేసుకున్న ఆశ్చర్యకర విషయాలు ఏంటంటే..

అగ్రరాజ్య అధినేత(America President) జో బైడెన్.. తన భార్య జిల్ బైడెన్‌కు ఐదుసార్లు లవ్ ప్రపోజ్(Joe Biden Proposed Jill) చేశాడట. అంతేకాదండోయ్ బైడెన్ ప్రేమకు ఆయన కుమారులు ఫుల్ సపోర్ట్ ఇచ్చి, ప్రోత్సహించారట కూడా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బైడెన్ తన జీవితంలో రెండు సార్లు ప్రేమలో పడ్డాడట. ఇవన్నీ సోషల్ మీడియా పుకార్లు కాదు.. స్వయంగా ఆయనే ఈ విషయాలను వెల్లడించారు. ప్రముఖ హాలివుడ్ నటి డ్ర్యూ బ్యారీమోర్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘ది డ్ర్యూ బ్యారీ‌మోర్ షో’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు తన సతీమణితోపాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Viral News: ఈ ఫొటో చూసి.. అందరిలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే..

‘మీ పెళ్లి(1977)కి ముందు మీరు నిజంగా జిల్ బైడెన్‌(Jill Biden)కు ఐదుసార్లు లవ్ ప్రపోజ్ చేశారా?’ అంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు బైడెన్ ‘అవును’ అంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. ‘మొదటిసారి జిల్ బైడెన్‌తో కలిసి బయటికి వెళ్లినప్పుడే.. ఆమె నా కోసమే అనే విషయం అర్థమైంది’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో హోస్ట్ కలుగజేసుకుని ‘మీరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ను నమ్ముతారా?’ అని ప్రశ్నించగా.. ‘అవును నేను నమ్ముతాను’ అంటూ బైడెన్ సమాధానం చెప్పారు. తన జీవితంలో రెండు సార్లు ప్రేమలో పడ్డట్టు జో బైడెన్ వెల్లడించారు. జిల్‌ బైడెన్‌పై తనకు ఉన్న ఇష్టాన్ని తెలుసుకుని.. బ్యూ(Beau), హంటర్(Hunter) ప్రోత్సహించినట్టు వివరించారు.

అనంతరం జిల్ బైడెన్ మాట్లాడుతూ.. బైడెన్‌తో పెళ్లికి ముందు తను చేసిన ఆలోచనల గురించి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ‘జో బైడెన్ నా కోసం ప్రతి ఏడాది ఒక కవిత రాస్తారు. దాన్ని నాకు గిఫ్ట్‌గా ఇస్తారు. నా కోసం కవితలు రాయడానికి ఆయన ఏకంగా ఒక బుక్‌ను కొనుగోలు చేశారు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. జో బైడెన్ మొదటి భార్య నీలియా 1972లో జరిగిన కారు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయన ఏడాది కూతురు నవోమీ కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-28T17:38:38+05:30 IST