Maternal deaths: ప్రసూతి మరణాలు తగ్గినట్టే..!

ABN , First Publish Date - 2022-12-03T10:04:07+05:30 IST

ఈశాన్య రాష్ట్రంలో ప్రతి లక్ష సురక్షిత కాన్పులకు 195 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి.

Maternal deaths: ప్రసూతి మరణాలు తగ్గినట్టే..!
Maternal deaths

సురక్షితమైన కాన్పు జరిగి, తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారనే వార్త ఆ కుటుంబాల్లో ఎంతో ఆనందాన్ని నింపుతుంది. గర్భధారణలో సమస్యలు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అనారోగ్య సమస్యలతో జరుగుతున్న ప్రసూతి మరణాలు ఈమధ్య కాలంలో తగ్గుముఖం పట్టాయని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) ‘ప్రసూతి మరణాలపై ప్రత్యేక బులెటిన్’ విడుదల చేసింది. దీని ప్రకారం 2020 వరకు గణాంకాల ప్రకారం సురక్షితమైన కాన్పుల సంఖ్య పెంచే విధంగా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలనేది నివేదిక సారాంశం.

దేశంలో ప్రసూతి మరణాల రేటు (MMR)లో అస్సాంలో అధ్వాన్నంగా కొనసాగుతోన్న తరుణంలో ఈ రేటులో ఇప్పుడు స్వల్ప మెరుగుదల నమోదు చేసింది. 2018 నుండి 2020 వరకు ప్రత్యేక బులెటిన్ నివేదిక ప్రకారం, ఈశాన్య రాష్ట్రంలో ప్రతి లక్ష సురక్షిత కాన్పులకు 195 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ఇది 2016 నుండి 2018 వరకు మునుపటి సంఖ్య 215 నుండి మెరుగైంది.

ప్రతి లక్ష సురక్షిత జననాలకు 173 , ఉత్తరప్రదేశ్ 167తో మధ్యప్రదేశ్ రెండవ అత్యధిక MMRతో చేర్చబడింది. ముఖ్యంగా, కేరళలో అత్యల్పంగా ప్రతి లక్ష సజీవ జననాలకు 19, మహారాష్ట్ర 33, తెలంగాణా 43 నమోదు చేసింది.

ప్రత్యేక బులెటిన్ ప్రకారం, దేశ సగటు MMR 2016 నుండి 2018, 2018 నుండి 2020కి 97కి తగ్గింది. మూడు రాష్ట్రాలు (కేరళ, మహారాష్ట్ర , ఉత్తరప్రదేశ్) ఎమ్‌ఎమ్‌ఆర్‌ లో 15% కంటే ఎక్కువ తగ్గుదల కనిపించింది. ఇక జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 10-15% మధ్య తగ్గుదల నమోదయింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, కర్ణాటకలో 5-10% మధ్య ఎమ్‌ఎమ్‌ఆర్‌ నమోదయింది. అతి తక్కువ ఎంఎంఆర్‌లో దేశంలోనే తెలంగాణా రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కేరళ (19), రెండో స్థానంలో మహారాష్ట్ర (33) నిలిచాయి.

మన దగ్గర కూడా సురక్షితమైన కాన్పులు జరిగేలా సుస్థిర అభివృధ్ధి లక్ష్యాన్ని సాధించేలా జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపడుతున్న చర్యలు ఆశించిన ఫలితాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం శిశు సురక్షా కార్యక్రమం, జననీ సురక్ష యోజన వంటి ఫథకాలు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ఇనిషియేటివ్ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటి ద్వారా లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన వైద్య సదుపాయాలు అమలు జరుగుతున్నాయి.

వీటితో పాటు కేంద్ర మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పోషణ్ అభియాన్ వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేస్తున్నది. వీటి ద్వారా గర్భిణీ, బాలింతలు, పిల్లలకు పోషకాహార పంపిణీ జరుగుతుంది. మాత, శిశు సంరక్షణలో భాగంగా తెలంగాణాలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన కేసీఆర్‌ కిట్లు పథకం విప్లవాత్మకమైన మార్పు తెచ్చిందనే చెప్పాలి. గర్భిణులకు ప్రతి నెలా పరీక్షలు చేయించడం, అమ్మఒడి వాహనాలతో వారికి నాణ్యమైన సేవలు అన్ని దశల్లో అందుతున్నాయి. ఇవన్నీ సురక్షితమైన ఆరోగ్యకరమైన శిశు జననాలను ప్రోత్సహిస్తూ, ప్రసూతి మరణాలను అరికట్టడంలో వైద్యశాఖ మరింత మంచి ఫలితాలను అందుకోవాలి

Updated Date - 2022-12-03T10:11:50+05:30 IST