Vaarasudu: దిల్ రాజు వారసుడిని పరిచయం చేసిన విజయ్!

ABN , First Publish Date - 2022-11-01T15:13:29+05:30 IST

దిల్ రాజు వారసుడి విషయానికి వస్తే.. మొదటి భార్య అనిత అకాల మరణం తర్వాత.. తేజస్విని అనే ఆమెను దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు

Vaarasudu: దిల్ రాజు వారసుడిని పరిచయం చేసిన విజయ్!
Dil Raju son in Vijay Hands

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) హీరోగా.. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారసుడు’ (Vaarasudu). 2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. షూటింగ్ గ్యాప్‌లో నిర్మాత దిల్ రాజు ఇంటికి వెళ్లిన విజయ్.. ఆయన వారసుడిని ఎత్తుకుని కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూసిన వారంతా.. దిల్ రాజు ‘వారసుడు’ని విజయ్ పరిచయం చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ చేస్తున్న ‘వారసుడు’ సినిమా టైటిల్‌కి తగినట్లుగా.. స్టార్ హీరో తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేసేలా.. దిల్ రాజు భలే ప్లాన్ చేశాడంటూ.. కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో.. ఈ పిక్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

దిల్ రాజు వారసుడి విషయానికి వస్తే.. మొదటి భార్య అనిత అకాల మరణం తర్వాత.. తేజస్విని అనే ఆమెను దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇటీవల పండంటి బాబు జన్మించాడు. అయితే ఇప్పటి వరకు ఆ బాబుని దిల్ రాజు పరిచయం చేయలేదు. రీసెంట్‌గా దిల్ రాజు దంపతులు తిరుపతి వెళ్లినప్పుడు కూడా.. కుమారుడిని మీడియా కంటికి కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పుడు దిల్ రాజు తన వారసుడిని.. ఇలా ఆయన చేస్తున్న ‘వారసుడు’ సినిమా హీరోతో పరిచయం చేయించడం విశేషమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం విజయ్ చేతుల్లో దిల్ రాజు వారసుడు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Producer Dil Raju son)

Updated Date - 2022-11-01T15:17:47+05:30 IST