NTR30: ఆగిపోలేదు.. ఇదిగో అప్‌డేట్!

ABN , First Publish Date - 2022-10-31T15:29:23+05:30 IST

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన NTR30 సినిమాపై ఈ మధ్యకాలంలో ఎటువంటి రూమర్స్ వైరల్..

NTR30: ఆగిపోలేదు.. ఇదిగో అప్‌డేట్!
NTR30 Movie Poster

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన NTR30 సినిమాపై ఈ మధ్యకాలంలో ఎటువంటి రూమర్స్ వైరల్ అవుతున్నాయో తెలిసిందే. ఈ సినిమా అప్‌డేట్ కోసం వేచి చూసి చూసి.. అభిమానులే అప్‌డేట్స్ ఇచ్చే స్థాయికి వచ్చేశారు. నిర్మాణ సంస్థ అయినటువంటి యువసుధ ఆర్ట్స్ (Yuvasudha Arts) పేరుతో ట్విట్టర్‌లో పలు అకౌంట్స్ క్రియేట్ చేసి.. NTR30 అప్‌డేట్ అంటూ హల్‌చల్ చేస్తున్నారు. వాళ్లు ఎంతగా ప్రయత్నించినా.. మేకర్స్‌ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని, ఎన్టీఆర్ మరో డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలతో NTR30 మరోసారి ట్రెండ్ అవుతుండటంతో.. మేకర్స్ సైడ్ నుంచి చిత్ర పీఆర్వో.. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఆగిపోలేదంటూ అప్‌డేట్ ఇచ్చారు.

‘‘#NTR30 Update.. దర్శకుడు కొరటాల శివ, డిఓపి రత్నవేలు (DOP Ratnavelu), ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ (Sabu Cyril) భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్‌ పనులని వేగవంతం చేశారు. సినిమా అతి త్వరలో సెట్స్ పైకి రానుంది..’’ అని చిత్ర పీఆర్వో వంశీ కాకా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆయనకి థ్యాంక్స్ చెబుతుంటే.. మరికొందరు మాత్రం ‘దాదాపు సంవత్సరం నుంచి ఇదే మాట చెబుతూ వస్తున్నారు. పూజా కార్యక్రమాలు ఎప్పుడో చెప్పండి సార్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మార్నింగ్ నుంచి.. ఈ సినిమా ఆగిపోయిందని, తారక్ తన తదుపరి సినిమా నిమిత్తమై ఈ వారంలో మరో దర్శకుడు చెప్పబోయే కథ వినబోతున్నారనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. చిత్ర పీఆర్వో పై విధంగా ట్వీట్ చేసి.. ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. (NTR30 Update)

Updated Date - 2022-10-31T15:36:30+05:30 IST