Delhi Liquor Scam: కనికారెడ్డి విమానాల్లోనే డబ్బు వచ్చిందా..

ABN , First Publish Date - 2022-11-16T22:17:15+05:30 IST

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక మలుపు తిరిగింది.

Delhi Liquor Scam: కనికారెడ్డి విమానాల్లోనే డబ్బు వచ్చిందా..

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో మరో కీలక మలుపు తిరిగింది. కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల రాకపోకలపై వివరాలను కోరుతూ ఎయిర్ ఫోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ ఈడీ రాసింది. అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణే కనికారెడ్డి, జెట్ సెట్ గో పేరుతో ప్రైవేటు జెట్ చార్టర్డ్ సర్వీసులను కనికారెడ్డి నడుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన నగదును కనికారెడ్డి విమానాల్లోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

kkk.jpg

కనికారెడ్డి కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, అందులో ప్రయాణించిన వారి వివరాలన్నింటినీ ఇవ్వాలంటూ గతంలో ఈడీ లేఖ రాసింది. ఈడీ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 17న ఎయిర్ ఫోర్ట్స్ అథారిటీకి ఈడీ లేఖ రాసింది. ఎయిర్ ఫోర్ట్స్ అథారిటీ ఇచ్చిన ఆధారాలతోనే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లు సమాచారం అందింది. కనికారెడ్డి విమానాల్లో కవితతో పాటు పలువురు నేతలు ప్రయాణించినట్లు ఏఏఐ ఇచ్సిన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Kanikareddy.jpg

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బేగంపేట ఎయిర్‌పోర్టు కేంద్రంగా నగదు బదిలీ, ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. శరత్ చంద్రారెడ్డి భార్య నడుపుతున్న కానిక టెక్రివాల్ సంస్థ ద్వారా లావాదేవీలు, జెట్‌సెట్‌ గో సంస్థ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లుగా అనుమానం తెలుస్తోంది. జెట్‌సెట్‌ గో సంస్థ సీఈవోగా శరత్‌చంద్రారెడ్డి భార్య పనిచేస్తున్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీని వివరాలు కోరుతూ గత నెల 17వ తేదీన ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే శరత్‌చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. జెట్‌సెట్‌గో ఎయిర్‌వేస్ ప్రయాణికుల వివరాలను కోరుతూ ED Dy డైరెక్టర్ రాజన్ గుప్తా ఎయిర్ ఇండియా అథారిటీకి లేఖ రాశారు కనికా టేక్రివాల్ రెడ్డి w/o శరత్ చంద్రారెడ్డికి చెందిన ఎయిర్‌వేస్ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ED Dy డైరెక్టర్ అక్టోబర్ 17న ఎయిర్ ఇండియా అథారిటీకి లేఖ రాశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఈ ఎయిర్‌వేస్‌ ద్వారా ఢిల్లీకి భారీగా డబ్బు రవాణా అయినట్లు ఈడీ అనుమానిస్తోంది.

ed.jpg

Updated Date - 2022-11-16T22:51:57+05:30 IST