Beetroot health benefits: ఆహారంలో బీట్‌రూట్‌ తీసుకోవడం వల్ల కలిగే 5 బెనిఫిట్స్ ఇవే..!

ABN , First Publish Date - 2022-11-22T10:50:49+05:30 IST

మనం తీసుకునే రోజువారి ఆహారంలో బలమైన ఆహారపదార్థాలను తీసుకోవాలి

Beetroot health benefits: ఆహారంలో బీట్‌రూట్‌ తీసుకోవడం వల్ల కలిగే 5 బెనిఫిట్స్ ఇవే..!
beetroot

మనం తీసుకునే రోజువారి ఆహారంలో బలమైన ఆహారపదార్థాలను తీసుకోవాలి అని అనుకుంటాం. అయితే దీనికి ప్రతి పదార్థమూ పోషకాలతో ఉండదు. మామూలుగా తీసుకునే ఆహారానికి పోషకాలతో నిండిన ఆహారానికి మధ్య వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం. బీట్‌రూట్ ని ఎక్కువగా జ్యూస్ గాను, ఫ్రైగాను తీసుకుంటాం. కాకాపోతే మిగతావాటిలా బీట్ రూట్ వాడకం ఆహారంలో తీసుకోవడం తక్కువే. అయితే బీట్ రూట్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో దొరికే విటమిన్లు, ఖనిజాలు, మొక్కల సమ్మేళనాలు వంటి పోషకాలను ఎక్కువగా ఉంటాయి, వీటిలో చాలా చికిత్సా ప్రయోజనాలను ఉన్నాయి. అవి ఏంటంటే..

1. క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.

కొన్ని బీట్-ఉత్పన్న రసాయనాలు క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయని అధ్యయనాలు చెపుతున్నాయి.

2. అథ్లెటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది.

బీట్ రూట్ వ్యాయామం సమయంలో ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడానికి 2-3 గంటల ముందు దీనిని తీసుకోవాలి.

3. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

బీట్‌రూట్‌ లో సమృద్ధిగా ఉండే నైట్రేట్లు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి, దీని ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.

4. బీట్‌రూట్‌ లో పోషకాలు అధికంగా ఉంటాయి.

ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కేలరీలు, కొవ్వు తక్కువగా ఉన్నప్పటికీ, విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫోలేట్, మాంగనీస్, రాగి వంటి మూలకాలను కూడా కలిగి ఉంది.

5. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీట్‌రూట్‌ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనేక దీర్ఘకాలిక వైద్య రుగ్మతలను తగ్గిస్తుంది.

Updated Date - 2022-11-22T11:31:31+05:30 IST