Anjeer health benefits: ఆహారంలో అంజీర్ పండ్లను ఎందుకు చేర్చుకోవాలి..!

ABN , First Publish Date - 2022-11-29T11:19:59+05:30 IST

పొటాషియంలో అసమతుల్యత అధిక రక్తపోటుకు దోహదపడే కారకాల్లో ఒకటి.

Anjeer health benefits: ఆహారంలో అంజీర్ పండ్లను ఎందుకు చేర్చుకోవాలి..!
fig

అంజీర్ దీనినే అత్తి పండ్లు. వీటిని మామూలు పండ్లగాను, ఎండు ఫలాలుగానూ తీసుకునేందుకు ఇష్టపడతారు. హిందీలో వీటిని అంజీర్ అని కూడా పిలుస్తారు. ఈ అంజీర్‌ పండ్లలో ఐరన్‌, కాల్షియం, విటమిన్లు, పొటాషియం, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కార్బొహైడ్రేట్లు, ఫైబర్‌ కూడా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఉదయాన్నే ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అంజీర్ చెట్టుకు ఆహారం, ఔషధంగా రెండు విధాలా విలువైన చరిత్ర ఉంది. అంజీరా పండ్లను సహజంగా కొలెస్ట్రాల్ ఫూట్ గా వీటిని తినడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల్లో ఒకటి.

అంజీర్ తో కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు

1. రక్తపోటును తగ్గిస్తుంది

రక్తపోటును తగ్గిస్తుంది. అధిక సోడియం, తగినంత పొటాషియం తీసుకోవడం వల్ల పొటాషియంలో అసమతుల్యత అధిక రక్తపోటుకు దోహదపడే కారకాల్లో ఒకటి. అత్తి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అవి దానిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. అత్తి పండ్లలోని అధిక ఫైబర్ కంటెంట్ అదనపు ఉప్పు శరీరాన్ని ఫ్లష్ చేయడంలో సహాయపడుతుంది.

2. పేగు ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

పేగు ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ తీసుకోవడం పెంచడం వల్ల విరేచనాలు, మలబద్ధకంతో సహా వివిధ రకాల జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో పాటు, అత్తి పండ్లు ప్రీబయోటిక్స్ కలిగి ఉన్నాయి, ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

3. నిద్రను మెరుగుపరుస్తుంది

నిద్రను మెరుగుపరుస్తుంది. మెలటోనిన్, నిద్ర చక్రాలను నియంత్రించడానికి, నిద్రలేమి చికిత్సలో సహాయపడుతుంది, అంజీర్ మెదడులో సెరోటోనిన్ స్థాయిలను కూడా పెంచుతుంది, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

4. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే మెగ్నీషియం, విటమిన్లు సి,ఇ, జుట్టుకు అద్భుతమైన అంజీర్‌లో ఉండే భాగాలు. ఈ పోషకాలు స్కాల్ప్ లోని రక్త ప్రవాహాన్ని సరిచేసి, జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.

5. మొటిమలు

అంజీర్‌లో మొటిమలను నిరోధించే గుణాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పండ్లు, ఆకులు సాధారణ మందులతో సమానంగా ఉండే మొటిమల నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

Updated Date - 2022-11-29T11:35:15+05:30 IST