Tenth exams: 6 పేపర్లతో ఏప్రిల్‌ 3 నుంచి పరీక్షలు

ABN , First Publish Date - 2022-12-29T11:15:51+05:30 IST

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల (Tenth exams)ను ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (State Education Minister Sabitha Indra Reddy) బుధవారం అధికారులతో సమీక్షించిన అనంతరం

Tenth exams: 6 పేపర్లతో ఏప్రిల్‌ 3 నుంచి పరీక్షలు
ఏప్రిల్‌ 3 నుంచి పరీక్షలు

ఇక 6 పేపర్లతోనే నిర్వహణ

ఉ.9.30 నుంచి మ.12.30 వరకు

సామాన్యశాస్త్రంలో మాత్రం 2 పేపర్లు

ఫిజిక్స్‌, బయలాజీకి గంటన్నర చొప్పున

ఏప్రిల్‌ 11తో పరీక్షల ముగింపు

12, 13 తేదీల్లో ఒకేషనల్‌ పరీక్ష

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల (Tenth exams)ను ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (State Education Minister Sabitha Indra Reddy) బుధవారం అధికారులతో సమీక్షించిన అనంతరం పరీక్షల షెడ్యూల్‌ విడుదల (Exam schedule release) చేశారు. ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లతోనే పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు(Telangana Government orders) జారీ చేసింది. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. వంద శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్‌ చాయిస్‌ ఉంటుంది. సూక్ష్మరూప ప్రశ్నలకు ఉండదు. ఈ మేరకు నమూనా ప్రశ్న పత్రాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరీక్షలను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే సామాన్య శాస్త్రం పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 3న ప్రారంభమయ్యే పరీక్షలు 11వ తేదీతో ముగియనున్నాయి.

ఏప్రిల్‌ 12, 13వ తేదీల్లో ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఇక నుంచి ఈ తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో సబ్జెక్ట్‌లో 80 మార్కులకు పరీక్ష, 20 మార్కులకు ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌ ఉంటుంది. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీలకు చెరిసగం మార్కులు కేటాయించింది. గతంలో టెన్త్‌ పరీక్షలు 11 పేపర్లతో నిర్వహించేవారు. కరోనా వల్ల వాటిని ఆరుకు కుదించింది. ఇకపై ఇదే పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో తెలుగు, ఇంగ్లిషు, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను రెండు పేపర్లుగా నిర్వహించేవారు. హిందీకి ఒకే పరీక్ష నిర్వహించేవారు. ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు (3 లాంగ్వేజీలు, 3 సబ్జెక్టులు) ఒక్కో పేపర్‌తో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ పేపర్‌కు 100 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులు ఉంటాయి. సామాన్య శాస్త్రం పరీక్షను రెండుగా విడదీశారు. ఫిజికల్‌ సైన్స్‌ను పేపర్‌-1గా, బయోలాజికల్‌ సైన్స్‌ను పేపర్‌-2గా పరీక్ష నిర్వహిస్తారు. రెండు పేపర్లను ఒకే పేపర్‌గానే పరిగణిస్తారు. ఒక్కో పేపర్‌ 50 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షకు 3.20 గంటల సమయం (పేపర్‌-1, పేపర్‌-2కు చెరో గంటన్నర) ఇస్తారు. పేపర్‌-1 పరీక్ష ముగిశాక సమాధాన పత్రాలను తీసుకోవడం, పేపర్‌-2 ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి 20 నిమిషాల సమయం ఉంటుంది.

eel.gif

విద్యార్థులకు ప్రత్యేక తరగతులు: సబిత

పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, దీనికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

రూ.1000 లేట్‌ ఫీజుతో ఇంటర్మీడియట్‌ ఫీజు(Intermediate fee) చెల్లింపు గడువును పొడిగించారు. ఈ నెల 16తో ముగిసిన గడువును తాజాగా జనవరి 6 వరకు పొడిగించినట్టు ఇంటర్మీడియట్‌ బోర్డు(Intermediate Board) తెలిపింది.

sudule.gif

Updated Date - 2022-12-29T11:16:16+05:30 IST