TDP Leader: వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

ABN , First Publish Date - 2022-12-07T10:47:48+05:30 IST

వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ జిల్లాలోని గణపతినగరం నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు

TDP Leader: వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

విజయనగరం: వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ జిల్లాలోని గణపతినగరం నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మార్వో ఆఫీస్‌ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు నేతలు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డా.కే.ఏ నాయుడు (KA Naidu) మాట్లాడుతూ... సీఎం జగన్‌రెడ్డి బీసీలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, బీసీల్లో ఏ ఒక్క కుటుంబానికి రాయితీతో కూడిన ప్రయోజనాలు అందించలేదని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ.34వేల కోట్ల నిధులు దారి మళ్లించి వైసీపీ తీరని ద్రోహం చేసిందని అన్నారు. టీడీపీ హయాంలో బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, గతంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు అందించిన పథకాలన్నింటినీ పూర్తిగా అటకెక్కించారని డా. కేఏ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పివివి గోపాల రాజు, కొప్పుల వెలమ బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్ అల్లు విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ లు కొరుపోలు రమేష్ కుమార్, బండారు బాలాజీ, మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మునాయుడు,కనకల మురళి, కోరాడ కృష్ణ, కొండపల్లి భాస్కర్ నాయుడు, పెద్దింటి మోహన్, పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు వేమలి చైతన్య బాబు, మహిళా ఉపాధ్యక్షురాలు వైకుంఠం మైథిలీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T10:47:48+05:30 IST

Read more