TDP Protest: పాయకరావుపేటలో టీడీపీ భారీ నిరసన

ABN , First Publish Date - 2022-12-19T12:55:58+05:30 IST

జిల్లాలోని పాయకరావుపేటలో టీడీపీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది.

TDP Protest: పాయకరావుపేటలో టీడీపీ భారీ నిరసన

అనకాపల్లి: జిల్లాలోని పాయకరావుపేటలో టీడీపీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పాయకరావుపేటలో దళితులకు అధికంగా వచ్చిన విద్యుత్ చార్జీలుకు టీడీపీ ర్యాలీకి దిగింది. టీడీపీ పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిరసన జరుగుతోంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు వెంటనే తగ్గించాలని ఆందోళన చేపట్టారు. పాయకరావుపేట గౌతమ్ జంక్షన్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ అధికారులకు టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2022-12-19T13:08:09+05:30 IST