CM Jagan: 27న నెల్లూరులో జగన్ పర్యటన
ABN , First Publish Date - 2022-10-25T14:58:48+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు)ను సీఎం (Jagan) జాతికి అంకితం చేయనున్నారు. జగన్ గురువారం ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి, 10:55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు)ను సీఎం జగన్ (AP CM) జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తిరిగి 3:30 గంటలకు తాడేపల్లి నివాసానికి ముఖ్యమంత్రి జగన్ (YCP Chief) చేరుకోనున్నారు.