AP News: నేడు శ్రీశైలం చేరుకోనున్న జగద్గురు స్వామీజీ పాదయాత్ర
ABN , First Publish Date - 2022-11-30T10:12:25+05:30 IST
శ్రీశైల జగద్గురు స్వామిజి చెన్నసిద్దరామ పండితారాధ్య మహాస్వామీజీ పాదయాత్ర శ్రీశైలం నల్లమల అడవులకు చేరుకుంది.

నంద్యాల: శ్రీశైల జగద్గురు స్వామిజీ చెన్నసిద్దరామ పండితారాధ్య మహాస్వామీజీ పాదయాత్ర శ్రీశైలం నల్లమల అడవులకు చేరుకుంది. గత నెలలో కర్నాటక నుంచి స్వామీజీ పాదయాత్రను మొదలుపెట్టారు. లోకకళ్యాణార్ధం సుమారు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న జగద్గురు పీఠాధిపతి ఈరోజు శ్రీశైలం చేరుకోనున్నారు. దాదాపు 40 రోజులకుపైగా పాదయాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామి అమ్మవార్లను జగద్గురు పీఠాధిపతి దర్శించుకోనున్నారు. స్వామీజీ దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు.
Read more