BC Sabha: వైసీపీ జయహో బీసీ సభకు ఆదరణ కరువు
ABN , First Publish Date - 2022-12-07T11:09:31+05:30 IST
వైసీపీ జయహో బీసీ సభకు ఆదరణ కరువైంది.
విజయవాడ: వైసీపీ జయహో బీసీ సభకు ఆదరణ కరువైంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ బీసీలు పట్టించుకోలేదు. బస్సులు వేసి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ బీసీలు ముందుకు రాలేదు. సభ ప్రారంభం అయ్యి గంటపైనే గడుస్తున్నా ఇంకా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీంతో పోలీస్ యంత్రాంగం గాలరీలు నింపే పనిలో పడ్డారు. ఎండలో కుర్చీలు ఉండడంతో అక్కడి నుంచి కూడా జనాలు బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి వచ్చే వరకు అయినా జనాన్ని అట్టే ఉంచేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.