Pattabhi: సీఐడీ.. తాడేపల్లి ప్యాలెస్‌కు ఊడిగం చేస్తోంది

ABN , First Publish Date - 2022-12-12T14:48:46+05:30 IST

సంకల్పసిద్ధి స్కామ్‌పై పోలీస్ శాఖ కంటే ముందే సీఐడీ (Ap CID)కి ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదో సీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Kommareddy Pattabhiram) డిమాండ్ చేశారు. పట్టాభి మీడియాతో

Pattabhi: సీఐడీ.. తాడేపల్లి ప్యాలెస్‌కు ఊడిగం చేస్తోంది
తాడేపల్లి ప్యాలెస్‌కు ఊడిగం చేస్తోంది

అమరావతి: సంకల్పసిద్ధి స్కామ్‌పై పోలీస్ శాఖ కంటే ముందే సీఐడీ (Ap CID)కి ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదో సీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Kommareddy Pattabhiram) డిమాండ్ చేశారు. పట్టాభి మీడియాతో మాట్లాడారు. ‘‘కొన్నికోట్ల రూపాయలు పోగొట్టుకున్న సంకల్పసిద్ధి డిపాజిటర్లకు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్(CID Chief Sunil Kumar) ఏం జవాబు చెబుతారు? సకాలంలో సంకల్పసిద్ధిపై సీఐడీ చర్యలు చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేదా? ఆర్థిక నేరాలను అరికట్టి అసలు దొంగల్ని శిక్షించాల్సిన సీఐడీ.. అమాయకుల్ని వేధిస్తూ తాడేపల్లి ప్యాలెస్‌కు ఊడిగం చేస్తోంది. మూడున్నరేళ్లలో ప్రజలకు ఉపయోగపడే.. మంచి జరిగే ఒక్క కేసైనా సీఐడీ చేధించిందా? స్కామ్ తాలూకా ఫిర్యాదులు పోలీసులకంటే ముందే సీఐడీకి వెళ్లాయని విజయవాడ సీపీ క్రాంతిరాణా నవంబర్ 28న చేసిన ప్రకటనపై సీఐడీ చీఫ్ ఏం సమాధానం చెబుతారు? ఫిర్యాదులొచ్చినా ఎవరిని కాపాడటానికి ఆ సమాచారాన్ని డిపార్ట్‌మెంట్‌లో ఎవరు తొక్కిపెట్టారో సీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలి. ఎవరి ఆదేశాలతో సీఐడీ బాస్ చేతులు కట్టుకొని మౌనంగా కూర్చున్నారు? సీఐడీకి ఫిర్యాదులందితే ఎందుకు విచారించలేదని తాను ప్రశ్నించి 10 రోజులైనా ఇంతవరకు ఆ విభాగం ఎందుకు మౌనంగా ఉంది? ఫిర్యాదులు సీఐడీకి వెళ్లాయి కానీ.. తరువాత ఏం జరిగిందో తెలియదని చెప్పి విజయవాడ సీపీ దాటవేస్తే కుదరదు. రాష్ట్రంలో సీఐడీ బాధితుల చిట్టాకు అంతేలేదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ కాస్త తాడేపల్లి ప్యాలెస్‌కు చెంచాగిరీ చేసే డిపార్ట్‌మెంట్‌గా మారిందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. చంద్రబాబు హయాంలో ఏపీ పోలీస్ హోదా, గౌరవం ఎలా ఉండేవి.. ఇప్పుడెలా ఉన్నాయి?’’ అని పట్టాభి ప్రశ్నించారు.

Updated Date - 2022-12-12T14:48:48+05:30 IST