MP Raghurama: తప్పులు చేసి మీడియాను అనడం సరికాదు..

ABN , First Publish Date - 2022-12-28T15:56:14+05:30 IST

ఢిల్లీ: వైసీపీ పాలనలో 'తిట్లు తిట్టు-పోస్ట్ పట్టు' అంటూ సీఎం జగన్ కలెక్టర్లకు చెబుతున్నారని.. కలెక్టర్లు ఎవరినైనా తిడితే దాని పరిణామాలు వేరేలా ఉంటాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

MP Raghurama: తప్పులు చేసి మీడియాను అనడం సరికాదు..

వైసీపీ పాలన (YCP Govt.)లో 'తిట్లు తిట్టు-పోస్ట్ పట్టు' అంటూ సీఎం జగన్ (CM Jagan) కలెక్టర్లకు చెబుతున్నారని.. కలెక్టర్లు ఎవరినైనా తిడితే దాని పరిణామాలు వేరేలా ఉంటాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లలో 6 నెలల క్రితం ఉన్న అర్హత ఇప్పుడెలా పోతుందని ప్రశ్నించారు. పాలకులు తప్పులు చేసి మీడియా (Media)ను అనడం సరికాదని అన్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఐఏఎస్‌లకు బూతుల శిక్షణ తరగతులు ఇస్తారా?... జోగి రమేష్ (Jogi Ramesh) లాంటి వారిని పెట్టి ఇస్తారా? అని ప్రశ్నించారు. 36 వేల రూపాయలతో మీటర్లు పెట్టాలని ప్రభుత్వం చూసిందని.. ఈ మేరకు షిర్డీసాయి ఎలెక్ట్రికల్స్‌తో డీల్ కూడా కుదిరిందని.. అయితే దీనిపై పత్రికలు రాయడంతో డీల్ చెడిందన్నారు. మీటర్ పెద్ద స్కామ్ అని దీనిపై పారదర్శకంగా ముందుకు వెళ్ళాలని రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-28T15:56:19+05:30 IST