Pawan Kalyan: ఆనాడే పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి
ABN , First Publish Date - 2022-12-15T13:44:04+05:30 IST
ఏపీని అగ్రపధాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములు నిజమైన నివాళి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ‘
అమరావతి: ఏపీని అగ్రపధాన నిలిచిన నాడే పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) నిజమైన నివాళి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కారకుడైన ఆ అమరజీవి వర్థంతి సందర్భంగా నా పక్షాన జనసేన శ్రేణుల పక్షాన ముకుళిత హస్తాలతో నీరాజనాలు అర్పిస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘సంకల్పం బలంగా ఉన్నప్పుడు... లక్ష్యం ప్రజా ప్రయోజనం అయినప్పుడు...నీ వెంట ఒక్కడూ లేకున్నా... ఒక్కడూ రాకున్నా విజయం సిద్ధించటం తధ్యమని అమరజీవి పొట్టి శ్రీరాములు నిరూపించి చూపారు. తెలుగు మాట్లాడేవారంతా తెలుగుతల్లి నీడలో ఒక రాష్ట్రంగా కలిసిమెలిసి జీవించాలని ... తపించి తపించి తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఐదుపదుల వయస్సు నిండకుండానే తెలుగువారి కోసం తాను వెలుగుదివ్వెగా మారారు. ఇంతటి త్యాగ నిరతితో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునే అవకాశం విజ్ఞులైన ప్రజల చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధితో వెలుగొందుతూ అగ్రపధాన పయనించినప్పుడే పొట్టి శ్రీరాములుకు నిజమైన నివాళి’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.