AP News: అంబటి రాంబాబు ఇలాకాలో అరాచకం

ABN , First Publish Date - 2022-12-19T10:18:41+05:30 IST

మంత్రి అంబటి రాంబాబు ఇలాకాలో అరాచకం నెలకొంది.

AP News: అంబటి రాంబాబు ఇలాకాలో అరాచకం

పల్నాడు: మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఇలాకాలో అరాచకం నెలకొంది. ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెంలో ప్రజాధనంతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. 2003లో అప్పటి ఎంపీ వైవిరావు నిధులతో వృద్ధాశ్రమ నిర్మాణం జరిగింది. సత్తెనపల్లి - నరసరావుపేట రహాదారి వెంట ఉన్న వృద్దాశ్రమం స్థలం విలువ కోటి వరకు ఉండటంతో అక్రమార్కుల కన్ను పడింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధశ్రమాన్ని నేలమట్టం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-19T10:19:40+05:30 IST