జగనన్న పాల వెల్లువకు మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-12-08T00:32:52+05:30 IST

మండలంలో జగనన్న పాల వెల్లువ అమలు చేసే చర్యలలో భాగంగా మహిళా సంఘాలను గ్రూపులుగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ గోవింద్‌ తెలిపారు.

జగనన్న పాల వెల్లువకు   మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలి

తాళ్ళపూడి, డిసెంబరు 7: మండలంలో జగనన్న పాల వెల్లువ అమలు చేసే చర్యలలో భాగంగా మహిళా సంఘాలను గ్రూపులుగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ గోవింద్‌ తెలిపారు. ఆయన బుధ వారం ఐకేపీ, సచివాలయ సిబ్బందితో కలిసి కొన్ని సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నాణ్యమైన పాలను సరఫరాచేసే పేరున్న అమూల్‌ కంపెనీతో కలిసి పాలవెల్లువ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మాదిరిగానే మహిళా సంఘా లు ఏర్పాటు చేసి వారి ద్వారా పాల సేకరణ చేసి సంఘాలకు ఆర్థిక తోడ్పాటు కల్పించనున్నదని, సంఘాల ద్వారా సేకరించిన పాలను తిరిగి ఐసీడీఎస్‌ అంగన్‌వాడీ పిల్లలకు పంపిణీచేసే విధంగా సరఫరా చేయనుందని తెలిపారు. సహకార సంఘశాఖ, పశుసంవర్ధకశాఖ, ఐసీడీఎస్‌ శాఖల సమన్వయతో ఈ పథకం అమలు జరుగనుందని తెలిపారు. తాళ్ళపూడి మండలంలో 11, గోపాలపురం మండలంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పాల సేకరణ చేస్తామన్నారు. ఇప్పటికే చాగల్లు, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో రోజుకు 4000 లీటర్ల పాల సేకరణ జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,

Updated Date - 2022-12-08T00:32:52+05:30 IST

Read more