Sugunamma: సీఎం జగన్ బలిజల ద్రోహి

ABN , First Publish Date - 2022-12-22T13:33:52+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బలిజల ద్రోహి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శలు గుప్పించారు.

Sugunamma: సీఎం జగన్ బలిజల ద్రోహి

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan REddy) బలిజల ద్రోహి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (TDP Former MLA Sugunamma) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ కల్పించిన ఐదు శాతం రిజర్వషన్లను జగన్ సర్కార్ (Jagan Government) రద్దు చేసిందన్నారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రం 10 శాతం రిజ్వేషన్లు కల్పించిందని తెలిపారు. కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్‌లలో 5శాతం టీడీపీ కల్పించిందని గుర్తుచేశారు. కాపు కార్పొరేషన్‌కు సీఎం ఇప్పటి వరకు రూపాయి నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. తిరుపతి బలిజ భవన్ వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైందని తెలిపారు. బలిజ భవన్ భూమి కబ్జాలో స్థానిక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. కాపులకు ఐదు శాతం రిజ్వేషన్‌ను సీఎం జగన్ కల్పించాలని సుగుణమ్మ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-22T13:33:54+05:30 IST