Gorantla Madhav: హిందూపురంలో ఎంపీ గోరంట్లకు నిరసన సెగ

ABN , First Publish Date - 2022-12-06T14:00:07+05:30 IST

హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌కు నిరసన సెగ తగిలింది.

Gorantla Madhav: హిందూపురంలో ఎంపీ గోరంట్లకు నిరసన సెగ

అనంతపురం: హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ (MP Gorantla Madhav)కు నిరసన సెగ తగిలింది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన గోరంట్ల మాధవ్‌ను దళిత సంఘాలు అడ్డుకున్నాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరణ చేయకపోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ హాజరు కాకపోతే విగ్రహ ఆవిష్కరణ వాయిదా వేస్తారా అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో దళిత సంఘాల నేతలు వాగ్వివాదానికి దిగారు. దళిత సంఘాల నేతల ఒత్తిడితో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే గోరంట్ల మాధవ్ పూల దండ వేసి దండం పెట్టి వెళ్లిపోయారు.

Updated Date - 2022-12-06T14:00:08+05:30 IST