TDP Leader: పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-12-30T15:14:51+05:30 IST

ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు అయ్యింది.

TDP Leader: పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

అనంతపురం: ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌ (TDP Leader Paritala Sriram)పై కేసు నమోదు అయ్యింది. రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ పరిటాల శ్రీరామ్‌పై 153ఏ, 505 సెక్షన్ల కింద ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు కోసం తెలుగుదేశం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీతతో కలిసి బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ ప్రసంగించారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ మండల కన్వీనర్ జొన్నగిరి బాలపోతన్న ఫిర్యాదు చేశారు. బాల పోతన్న ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-12-30T15:14:53+05:30 IST