Share News

Shamshabad Airport: ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత..

ABN , Publish Date - May 03 , 2024 | 08:29 AM

నాలుగు రోజులుగా అధికారులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శంషాబాద్ ప్రాంతంలో ఓ చిరుత(Leopard) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది. విమానాశ్రయంలోని ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్‌లోని కంచెపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Shamshabad Airport: ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన చిరుత..

రంగారెడ్డి: నాలుగు రోజులుగా అధికారులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శంషాబాద్ ప్రాంతంలో ఓ చిరుత(Leopard) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది. విమానాశ్రయంలోని ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్‌లోని కంచెపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది.. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.

Nara Lokesh: హలో లోకేశ్.. నేడు యుగవళం.. దూసుకెళుతున్న నారా లోకేశ్


ఇక అప్పటి నుంచి చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేయడమే కాకుండా చిరుత ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఎవరూ చిరుత జాడ చెప్పలేదు. బోనును ఏర్పాటు చేశారు. మేకపిల్లను ఎర వేశారు. కానీ మేకపిల్ల వరకూ వచ్చి తిరిగి వెళ్లిపోయింది. దీంతో ఫారెస్ట్ అధికారులు తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు ఇవాళ తెల్లవారుజామున మేకపిల్లను తినడానికి వచ్చి బోనులో చిక్కింది. దీంతో అటవీశాఖ అధికారులతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల నేడు

మళ్లీ జగన్‌ వద్దు!

20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది

ఉద్యోగులకు.. జగన్ సర్కార్‌ దిమ్మతిరిగే షాక్!

Read Latest Telangana News and National News

Updated Date - May 03 , 2024 | 09:01 AM