Share News

Summer food: వేసవి ఫుడ్‌.. ఇలా ఉంటే బెస్ట్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:28 PM

ఎండ వేడికి శరీరంలో శక్తి సన్నగిల్లి జనం నీరసించి పోతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలో గర్భిణులు, బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని లేదంటే సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.

Summer food: వేసవి ఫుడ్‌.. ఇలా ఉంటే బెస్ట్‌

- పండ్లు, కూరగాయలు, పోషకాలు ఉండాలి

- 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తప్పనిసరిగా తాగాలి

హైదరాబాద్‌ సిటీ: ఎండ వేడికి శరీరంలో శక్తి సన్నగిల్లి జనం నీరసించి పోతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలో గర్భిణులు, బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని లేదంటే సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు(Fruits and vegetables) తినాలని చెబుతున్నారు. హైడ్రేటెడ్‌గా ఉండటానికి 8 నుంచి 10 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలని, పుదీనా నిమ్మరసం, జీరా మజ్జిగ, లేత కొబ్బరి నీరు, చెరకురసం తీసుకోవడం ద్వారా శరీరానికి ఎలక్ట్రోలైట్లు, పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, కాల్షియం కోసం పప్పులు, సూప్‌లు, పరోటాల్లో ఆకుకూరలు కలిపి తినాలన్నారు. ఐరన్‌ కోసం జామ, నారింజ, మామిడి, కివి తదితర విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం ఉత్తమమన్నారు. శరీరంలో ఐరన్‌ను నిరోధించే కాఫీ వంటి కెఫిన్‌ పదార్థాలను నివారించాలన్నారు.

ఇదికూడా చదవండి: Kanniyakumari: కన్నియాకుమారిలో గుహన్‌ బోట్‌ ట్రయల్‌ రన్‌..

city4.2.jpg

వీటిలో ఫైబర్‌ పుష్కలం

పుచ్చకాయలు, దోసకాయలు, వాటర్‌ యాపిల్‌, ఐస్‌ యాపిల్‌ తదితర పండ్లలో విటమిన్లు, పోషకాలు, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. సలాడ్‌లు, ఉడికించిన కూరగాయలు, క్యారెట్‌లు, బీట్‌రూట్‌లు, క్యాప్సికమ్‌ రోగ నిరోధకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. మెగ్నీషియం, జింక్‌, బీ కాంప్లెక్స్‌ విటమిన్ట కోసం పెరుగు, క్యారెట్‌ స్టిక్స్‌, బాదం, వాల్‌నట్‌, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలతో కూడిన స్నాక్స్‌ తీసుకోవాలి. బేబీ క్యారెట్లు, దోసకాయలు, ఉడికించిన స్వీట్‌కార్న్‌ వంటి సలాడ్‌లు మలబద్ధకం నివారణలో సహాయపడతాయి. వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు, బాదం, చేపలు, ఆలివ్‌నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు శిశువు మెదడు అభివృద్ధికి దోహదపడతాయి.

గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి

వేసవికాలంలో ఆహారం విషయంలో గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి. మధుమేహాన్ని తగ్గించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి తృణధాన్యాలు, ఓట్స్‌, మిల్లెట్లు, సింగిల్‌ పాలిష్‌ బియ్యం ఆహారంగా తీసుకోవాలి. పిజ్జా, బర్గర్లు, చిప్స్‌, ఫ్రెంచ్‌ప్రైస్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు పెంచే మసాలా గ్రేవీ కూరలు, మిరపకాయలు, పుల్లని ఆహారాలను తినడం తగ్గించాలి. ఒకేసారి తినే కంటే కొద్ది కొద్దిగా తినాలి.

- డాక్టర్‌ కృష్ణ దీపిక, సీనియర్‌ క్లినికల్‌

న్యూట్రిషనిస్టు, అపోలో క్రెడిల్‌, చిల్డ్రన్‌ ఆస్పత్రి

ఇదికూడా చదవండి: Viral Video: సింహానికి ఝలక్ ఇచ్చిన దున్నపోతు.. చంపాలని శక్తికొద్దీ పరుగెత్తినా.. చివరకు..

Read Latest National News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 12:28 PM