Share News

Tasty and Healthy : ఐస్ క్రీమ్ ఇలా చేసి చూడండి.. వేసవిలో చల్లని టైం పాస్.. !

ABN , Publish Date - May 09 , 2024 | 05:11 PM

ఐస్ క్రీమ్ ప్రత్నామ్మాయం, కోసం వెతుకుతుంటే కెమికల్స్ వాడకుండా ఎలాంటి స్వీట్నర్స్ ఉపయోగించకుండా ఉండాలంటే కొబ్బరిపాలు మంచి ఆప్షన్. దీనిలోని కమ్మదనం పాల అలెర్డీలు ఉన్నవారికి, బరువు పెరుగుతామనే భయం ఉన్నవారికి కూడా మంచి డెజర్ట్ గా ఉంటుంది.

Tasty and Healthy : ఐస్ క్రీమ్ ఇలా చేసి చూడండి.. వేసవిలో చల్లని టైం పాస్.. !
alternatives

కాలం మారిందని వేసవి వేడి అనే కాదు. కాలంతో పని లేకుండానే పిల్లలు, పెద్దలూ ఇష్టంగా తినే పదార్థం ఐస్ క్రీమ్. దీనిని ఇష్టపడనివారంటూ ఉండరు. ఐస్ క్రీమ్ లలో ఎన్నో ఫ్లేవర్స్ వాటి రుచికి రంగులకు ముందు ఇష్టపడిపోతారు. అయితే ఈ మధ్యకాలంలో షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినగలిగే విధంగా చాలా రకాల ఐస్ క్రీమ్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఐస్ క్రీమ్ తినడం వల్ల పళ్ళు పాడవుతాయని, ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నాకూడా వేసవి వచ్చిందంటే వీటికి గిరాకీ పెరుగుతూనే ఉంటుంది.

ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ..

ఆరోగ్యం కోసం మరీ స్వీట్నర్స్ వాడేయకుండా సహజంగా కొన్ని పండ్లతో తయారు చేసుకుని ఐస్ క్రీమ్స్ గురించి తెలుసుకుందాం. అరటిపండు్లు మంచి రుచితో అందరికీ ఇష్టమైన ఫూట్.. దీనితో చేసే ఐస్ క్రీమ్ కి కూడా మంచి టేస్ట్ వస్తుంది. అరటిపండ్లు, చాక్లెట్ కాంబినేషన్లో ఐస్ క్రీమ్ ట్రై చేస్తే సూపర్ టేస్ట్ తో తయారవుతుంది.

స్ట్రాబెర్రీ, అరటి పండు

చల్లగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు మరీ ఫ్లేవర్స్ తో ఉన్న ఐస్ క్రీమ్ కాకుండా మీరు తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు.

Health Benefits : చింతపండుతో మధుమేహం ఉన్నవారికి ఎన్ని బెనిఫిట్స్ అంటే...!

కొబ్బరి పాలతో చేసే ఐస్ క్రీమ్..

ఐస్ క్రీమ్ ప్రత్నామ్మాయం, కోసం వెతుకుతుంటే కెమికల్స్ వాడకుండా ఎలాంటి స్వీట్నర్స్ ఉపయోగించకుండా ఉండాలంటే కొబ్బరిపాలు మంచి ఆప్షన్. దీనిలోని కమ్మదనం పాల అలెర్డీలు ఉన్నవారికి, బరువు పెరుగుతామనే భయం ఉన్నవారికి కూడా మంచి డెజర్ట్ గా ఉంటుంది.

గ్రీకు పెరుగు..

దీనితో ఐస్ క్రీమ్ అంటే ఆరోగ్యకరమైన ఎంపికనే చెప్పలి. చక్కెర, పండ్లు కలిపి తయారుచేసే ఈ ఐస్ మంచి టేస్ట్‌తో ఉంటుంది.


Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

స్మూతీస్..

స్మూతీలు ఐస్ క్రీమ్ కు పోషకమైన ప్రత్యామ్నాయం. ఇది చల్లగా చక్కని రుచిని ఇస్తుంది. తాజా పండ్లతో తయారు చేయవచ్చు. భోజనం తిన్న ఫీలింగ్ ఉంటుంది. కడుపు నిండిపోయినట్టే ఒక్క స్మూతీతో.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 09 , 2024 | 05:11 PM